»   » అఫీషియల్: బాలయ్య 100 వ చిత్రానికి... అమరావతికి లింక్

అఫీషియల్: బాలయ్య 100 వ చిత్రానికి... అమరావతికి లింక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగ బాలకృష్ణ వందో చిత్రం గురించి రకరకాల వ్యాఖ్యానాలు వినపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో రైతులు కష్టాలు నేపధ్యంలో చిత్రం చేస్తారని, మరో ప్రక్క అదేంలేదు సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో ఆదిత్యా 999 చేస్తారని, పటాస్ దర్శకుడు విని ఓకే చేసారని ఇలా వినిపించాయి. మీడియా వీటిని హైలెట్ చేస్తూ వచ్చింది.

అయితే వీటిన్నటికి చెక్ పెడుతూ బాలయ్య వందో చిత్రం గురించి క్లూ ఈ రోజు ఇచ్చారు. ఆయన అసెంబ్లీ లాబీలో మాట్లాడుతూ..తన వందో చిత్రం అమరావతిని ఏలిన గౌతమీ పుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ఉంటుందని, అది ఒక హిస్టారికల్ చిత్రం అని అన్నారు. త్వరలో అఫీషియల్ ఎనౌన్సమెంట్ అమావస్య వెళ్లాక వస్తుందని చెప్పుకొచ్చారు.

 Balakrishna 100th Film on Amaravati king

అలాగే దర్శకుడుగా క్రిష్ ఉండే అవకాసం ఉందని, ఆ విషయమై చర్చలు జరుగుతున్నాయని హింట్ ఇచ్చారు. అంతేకాదు కృష్ణవంశీ రైతు రాజ్యం, సింగీతం గారి ఆదిత్యా 999 ఏ క్షణం అయినా పట్టాలు ఎక్కే అవకాసం ఉందని తేల్చి చెప్పారు.

అలాగే.. తన కుమారుడు మోక్షజ్ఞ తెరంగ్రేటంపై నందమూరి బాలకృష్ణ స్పష్టతనిచ్చారు. ఆదిత్య 369 సీక్వెల్‌ చిత్రంలో తాను, మోక్షజ్ఞ కలిసి నటిస్తామని చెప్పారు. అయితే ఆ చిత్రానికి ఇంకా సమయం ఉందన్నారు.

English summary
Balakrishna told them his much-awaited 100th flick will be a historical subject based on Amaravati king Goutamiputra Sathakarni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu