»   » 100వ సినిమాలో మోక్షజ్ఞ, స్పష్టం చేసిన బాలయ్య!

100వ సినిమాలో మోక్షజ్ఞ, స్పష్టం చేసిన బాలయ్య!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అభిమానుల్లో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. బాలయ్య 100వ సినిమాలో మోక్షజ్ఞ నటిస్తున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ‘డిక్టేటర్' ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. 100వ సినిమాలో మోక్షజ్ఞను తీసుకోవాలనే ఆలోచన అయితే ఉంది కానీ అప్పటికీ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేను అన్నారు బాలయ్య.

మోక్షన్ తొలి సినిమా విషయంలో భారీ ఆర్భాటాలకు పోవాలని అనుకోవడం లేదు. ప్రారంభంలో సినిమాలు మామూలుగానే.... వీడు మనబ్బాయి అనే విధంగా ప్రేక్షకులు ఫీలయ్యేలా ఉండాలి. ప్రపంచాన్ని కాపాడేసాడు అలాంటి హీరో పాత్రలు వద్దు. ముందు మామూలు సినిమాలతో ప్రేక్షకుల అభిమానం చూరగొంటే...మాస్ ఫాలోయింగ్ అదే వస్తుంది అన్నారు బాలయ్చ.

 Balakrishna about his son Mokshagna Debut

100వ సినిమా బోయపాటి దర్శకత్వంలోనే ఉంటుందా? అనే ప్రశ్నకు బాలయ్య స్పందిస్తూ...ప్రస్తుతం ఆ విషయమై చర్చలు జరుగుతున్నాయి. మార్చికల్లా 100వ సినిమాను మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. అప్పటికి బోయపాటి సిద్ధంగా ఉంటే సరే. లేదు నాలుగైదు నెలలు టైం పడుతుంది అంటే అంతకాలం నేను ఆగలేను. వెంటనే వేరొకరితో, ఇంకో సినిమా, పాత్ర చేయాల్సిందే అని బాలయ్య అన్నారు.

100 సినిమా తర్వాత సినిమాలకు దూరం అవుతా, కేవలం రాజకీయాల్లోనే ఉంటాననే ప్రచారంలో నిజం లేదు. లక్షలాది ప్రజలను తృప్తి పరిచే నటనను వదిలి పెట్టాను. ఇంకా చాలా పాత్రలు చేయాలని అభిమానులు కోరుతున్నారు. సినిమాలు చేస్తూనే ప్రజాసేవ కొనసాగిస్తాను అన్నారు బాలయ్య.

సింగితం శ్రీనివాస్ గారు ‘ఆదిత్య 369' సీక్వెల్ కథతో సహా సిద్ధంగా ఉన్న మాట నిజమే. అయితే ఈ సినిమా విషయంలో నేను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చేయాలా? వద్దా? అనేది సంక్రాంతి పండగ తర్వాత నిర్ణయం తీసుకుంటాను అన్నారు బాలయ్య.

English summary
Actor Nandamuri Balakrishna, who is busy with the Dictatormovie Promotions", has reportedly planned to launch the career of his son, Mokshagna Teja, with his 100th movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu