»   » మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రవాసాంధ్రులతో బాలకృష్ణ

మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రవాసాంధ్రులతో బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అంతటా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దానికి తోడు అతని ఎంట్రీపై రోజుకో వార్త వస్తోంది. ఈ నేపధ్యంలో బాలకృష్ణ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తన కుమారుడు మోక్షజ్ఞ ప్రస్తుతం బీబీఎం చదువుతున్నాడని, చదువు పూర్తయ్యాక అతడి ఆసక్తిని బట్టి భవిష్యత్తు నిర్ణయమవుతుందని నందమూరి బాలకృష్ణ చెప్పారు.

అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి నటించాలని ఓ మహిళ అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ చిరునవ్వే సమాధానంగా ఇచ్చారు. డల్లాస్‌లో జరిగిన నాట్స్‌ సంబరాల్లో భాగంగా ఆయనతో ప్రవాసాంధ్రులు నిర్వహించిన ముఖాముఖిలో ఒక ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. ఇక ముఖ్యమంత్రి పదవిపై తాను ఆలోచించట్లేదని, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన ధ్యేయమని బాలకృష్ణ అన్నారు.

తాను ఇకపై రాజకీయాల్లోనూ, తెలుగుదేశంలోనూ క్రియాశీల పాత్రపోషిస్తానని దీనివల్ల తన నట జీవితానికి ఎలాంటి ఆటంకం ఏర్పడదన్నారు. రాష్ట్రంలో తాను ఏ స్థానం నుంచి శాసనసభకు పోటీ చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. తమ ప్రాంతం నుంచి పోటీ చేయాలని కొంతమంది ప్రవాసాంధ్రులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. పార్లమెంటు ఎన్నికలు నవంబరు, డిసెంబరు నెలలో వచ్చే అవకాశాలున్నాయన్నారు.

ఇక జూలై 2 వ తేదీ నుంచి దుబాయిలో రెగ్యులర్ షూటింగ్ అనుకున్న బాలకృష్ణ-బోయపాటి చిత్రం వాయిదా పడినట్లు సమాచారం. జూలై 15 నుంచి హైదరాబాద్ లో ఈ షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం బాలకృష్ణ ..అమెరికాలో బసవతారక కాన్సర్ హాస్పటిల్ కు ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు.

English summary
Balakrishna had recently announced that his son Mokshagna would debut in films in a couple of years after completing his studies. It was rumoured that to bring him to music release function was a publicity stunt for his son. But unfortunately, Mokshagna has created a bad name for himself with this incident.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu