»   » వెయ్యి మంది జూనియర్‌ ఆర్టిస్టులు, వందల గుర్రాలు, ఒంటెలు

వెయ్యి మంది జూనియర్‌ ఆర్టిస్టులు, వందల గుర్రాలు, ఒంటెలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చూస్తూంటే బాలకృష్ణ తాజా చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'భారీగానే మనకు కనువిందు చేసేటట్లు ఉంది. ముఖ్యంగా దర్శకుడు క్రిష్ కావటం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఆయన కెరీర్ ప్రారంభం నుంచీ... కొత్త కథలు, కొత్త పాత్రలే కాదు, అప్పుడప్పుడూ కొత్త లొకేషన్లు చూపించడానికి ఉత్సాహం చూపిస్తూ వస్తున్నారు. అందుకే ఆయన సినిమాల్లో తెరపై సరికొత్త దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి.

తాజాగా ఆయన చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'కు అదే పనిచేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వందో చిత్రం కావటంతో చాలా ప్రతిష్ట్మాకంగా భావించి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల మొరాకోలో ఈ చిత్రం ప్రారంభమైంది. రెండు వారాలు ఏకధాటిగా అక్కడే కీలక సన్నివేశాలు తెరకెక్కించారు.


ఒకటో శతాబ్దానికి చెందిన సన్నివేశాలతో పాటు రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వంలో ఫైట్ సీన్స్ ని షూట్ చేసారు. దాదాపు వెయ్యి మంది జూనియర్‌ ఆర్టిస్టులు, వందల గుర్రాలు, ఒంటెల నేపథ్యంలో ఆయా సన్నివేశాల్ని తెరకెక్కించారు. మొరాకోలో ఇంత సుదీర్ఘకాలం చిత్రీకరణ జరుపుకొన్న తొలి భారతీయ చిత్రమిదే అని చెప్తున్నారు.


Balakrishna and unit back from Morocco

క్రిష్ మాట్లాడుతూ..''మొరాకోలో చిత్రీకరణ విజయవంతంగా పూర్తయింది. బాలకృష్ణ ప్రతి సన్నివేశంలోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయన జోరు మా అందరికీ సరికొత్త బలాన్నిచ్చింది'' అని క్రిష్‌ తెలిపారు.


అలాగే ''ఎంతో ప్రతిష్ఠాత్మకమైన బాలకృష్ణ గారి వందో చిత్రంగా ప్రారంభమైన మా చిత్రం షూటింగ్‌ అనుకున్న ప్రణాళిక ప్రకారం జరుగుతుండటం సంతోషంగా ఉంది. మొరాకో షెడ్యూల్‌లో బాలకృష్ణగారు ప్రతిరోజు పద్నాలుగు గంటలపాటు పనిచేశారు. ఆయన ఎనర్జీ మాకెంతో స్ఫూర్తినిచ్చింది'' అన్నారు.


నిర్మాతలు మాట్లాడుతూ ''ఎన్నో హాలీవుడ్‌ సినిమాలు షూటింగ్‌ జరుపుకునే మొరాకోలోని అద్భుతమైన లొకేషన్‌లలో రెండు వారాల పాటు చిత్రీకరణ జరుపుకున్న మొదటి తెలుగు సినిమా, మొదటి భారతీయ సినిమా ఇదే. మొరాకోలోని అట్లాస్‌ స్టూడియోస్‌, వరు జార్జియస్‌లో చిత్రీకరణ జరిపాం. బాలకృష్ణ, కబీర్‌ బేడిపై ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో హాలీవుడ్‌ ఫైటర్లతో యుద్ధ సన్నివేశాల్ని దర్శకుడు క్రిష్‌ చిత్రీకరించారు. దాదాపు వెయ్యిమంది ఈ షూటింగ్‌లో పాల్గొన్నారు. రెండు వందల గుర్రాలు, ఒంటెలను ఉపయోగించాం'' అని చెప్పారు.


ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మాతలు. చిత్రానికి మాటలు: బుర్రా సాయిమాధవ్‌, పాటలు: సీతారామశాస్త్రి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

English summary
After a hectic two-week shooting schedule in Morocco, the unit of Balakrishna’s Gautamiputra Satakarni is back to the city.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu