»   »  లయన్ ఫ్యాన్ షో: థియేటర్లో బాలయ్య, ఫ్యాన్స్ హంగామా (ఫోటోస్)

లయన్ ఫ్యాన్ షో: థియేటర్లో బాలయ్య, ఫ్యాన్స్ హంగామా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటించిన ‘లయన్' మూవీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైంది. ఈ రోజు తెల్లవారు ఝామునే అభిమానుల కోసం పలు చోట్ల బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. హైదరాబాద్ లో కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో ఫ్యాన్ షో ప్రదర్శించారు. ఈ షో చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు.

తెలుగు హీరోల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో బాలయ్య ఒకరు. ఆయన సినిమా రిలీజ్ అంటే హంగామా మామూలుగా ఉండదు. ఇక ఆ షోకు బాలయ్య కూడా వస్తున్నాడంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బాలయ్య కూడా ఈ బెనిఫిట్ షోకు హాజరు కావడంతో భ్రమరాంబ థియేటర్ సందడిగా మారింది.

మరో వైపు మీడియా హడావుడి కూడా కాస్త ఎక్కువే అయింది. లయన్ థియేటర్ వద్ద బాలయ్య, ఆయన అభిమానుల సందడికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

బాలకృష్ణ

బాలకృష్ణ


కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో ప్రదర్శించిన ఫ్యాన్ షోకు స్వయంగా బాలయ్య కూడా హాజరయ్యారు.

ఫ్యాన్స్ సందడి

ఫ్యాన్స్ సందడి


బాలయ్య రాకతో థియేటర్ కు అభిమానుల తాకిడి మరింత పెరిగింది.

లయన్

లయన్


ఈ రోజు విడుదలైన లయన్ మూవీకి రెస్పాన్స్ పాజిటివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఫ్యాన్స్ హంగామా

ఫ్యాన్స్ హంగామా


థియేటర్ల వద్ద టికెట్ల కోసం బాలయ్య అభిమానుల హంగామా.

అలంకరణ

అలంకరణ


పలువురు అభిమానులు థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

English summary
Nandamuri Balakrishna's Lion released today with the early fans show at Brahmaramba theatre, Kukatpally, Hyderabad. Also amidst huge fan galore, Lion hit screens all over Telugu states.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu