»   » బాలయ్య అభిమానులం-సమాజ సేవకులం (ఫోటోస్)

బాలయ్య అభిమానులం-సమాజ సేవకులం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలకృష్ణ నటించిన ‘లయన్' సినిమా విడుదల సందర్భంగా ‘ఎన్‌బి‌కె హెల్పింగ్ హాండ్స్' సంస్థ ఆధ్వర్యంలో అభిమానులు హైదరాబాద్ లోని భ్రమరాంభ థియేటర్ వద్ద హంగామా సృష్టించారు. ఎన్‌బి‌కె హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనంతపురం జగన్ సమక్షంలో థియేటర్ వద్ద ఏర్పాట్లు అదరగొట్టారు.

బాలయ్య అభిమానులం-సమాజ సేవకుల అంటూ థియేటర్ వద్ద భారీ పోస్టర్లు వెలిసాయి. ఆ పోస్టర్లలో సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య తో పాటు త్వరలో తెరంగ్రేటం చేయబోతున్న బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఫోటోలు కూడా ఉండటం గమనార్హం. ఉదయం ప్రదర్శించిన ఫ్యాన్ షోకు బాలయ్య స్వయంగా వచ్చి సినిమాను వీక్షించారు.


ఈ సందర్భంగా అభిమానులు సమక్షంలో లయన్ కేక్ కట్ చేసారు. బాలయ్య రాకతో థియేటర్ కిక్కిరిసిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....


పోస్టర్లు

పోస్టర్లు

కూకట్ పల్లిలోని భ్రమరాంభ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు. బాలయ్య అభిమానులం-సమాజ సేవకులం అంటూ ప్లెక్సీలపై రాసారు. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఫోటోలు కూడా ఏర్పాటు చేసారు.


బాలయ్య

బాలయ్య

సినిమా ప్రమోషన్లో భాగంగా బాలయ్య కూడా అభిమానులతో కలిసి సినిమా చూసారు.


ఫ్యాన్స్

ఫ్యాన్స్

బాలయ్య లయన్ సినిమా చూస్తుంటే...అభిమానులు మాత్రం ఆయన్ని తమ సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ గడిపారు.


కేక్ కటింగ్

కేక్ కటింగ్

భ్రమరాంభ థియేటర్ వద్ద లయన్ కేక్ కట్ చేస్తున్న బాలయ్య.


అభిమాని చేతులతో కేక్

అభిమాని చేతులతో కేక్

ఓ అభిమాని తన చేతులతో స్వయంగా బాలయ్యకు కేక్ తినిపిస్తున్న దృశ్యం.


బాలయ్య

బాలయ్య

బాలయ్య కేక్ తినిపిస్తున్న దృశ్యం.


కరచాలనం

కరచాలనం

థియేటర్ నుండి తిరిగి వెలుతూ అభిమానులతో కరచాలన చేస్తున్న బాలయ్య.


అభివాదం

అభివాదం

విక్టరీ సింబల్ చూపిస్తూ అభిమానులకు అభివాదం చేస్తున్న బాలయ్య


English summary
Balakrishna At Lion Movie Premier Show event held at Bramaramba Theatre, Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu