చిరంజీవికి సరైన మొగుడు బాలకృష్ణే...!?
ఇద్దరూ ఒకప్పుడు టాలీవుడ్ కు మకుటంలేని మహరాజులే. తెలుగు చిత్రసీమను ఒంటిచేతులతో శాసించినవారే. బాలకృష్ణ, చిరంజీవి చిత్రాలు తప్పనిసరిగా సంక్రాంతి బరిలో లేదా దసరాబరిలోనో ఏదో ఒక సందర్భంలో విడుదల కావాల్సిందే. అభిమానుల కోలాహలం మధ్య పోటాపోటీగా విడుదలయ్యేవి. ఒకసారి ఒకళ్ల చిత్రం హిట్ అయిందంటే మరోసారి వేరొకరి సినిమా హిట్ అవుతూ వచ్చేది. ఇద్దరూ మాస్ లీడర్లే.
కాగా చిరంజీవి సొంతంగా ప్రజారాజ్యం పార్గీ స్థాపించి ఆ తర్వాత దానిని కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి విదితమే. మరో రెండేళ్లలో జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీచేయనున్నారు. కానీ సిఎం పదవి నా ఆకాంక్ష కాదు. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వస్తాను అని అన్నారు. అయితే బాలకృష్ణ తాను వచ్చే ఎన్నికలలో పోటీచేస్తానని ప్రకటించిన నేపథ్యంలో చిరంజీవికి సరైన ప్రత్యర్థి బాలకృష్ణే అని అంతా భావిస్తున్నారు. సినిమాలలో తప్పని పోటీని రాజకీయరంగంలోనూ ఎదుర్కోక తప్పదని ఈ ఇద్దరు హీరోలు భావించడం కొసమెరుపు.


Click it and Unblock the Notifications











