»   » బాలయ్య బాబు నన్ను కొట్టలేదు, తప్పంతా నాదే: అభిమాని వివరణ

బాలయ్య బాబు నన్ను కొట్టలేదు, తప్పంతా నాదే: అభిమాని వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం 'గౌతమిపుత్రశాతకర్ణి' సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ హిట్ టాక్, అంచనాలకు మించిన కలెక్షన్లతో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. అంతా బాగానే ఉంది కానీ... ఇటీవల థియేటర్లో చోటు చేసుకున్న సంఘటన బాలయ్యపై నెగెటివ్ ప్రచారానికి కారణమైంది.

తనతో సెల్ఫీ తసుకోవడానికి ప్రయత్నించిన అభిమానిని బాలయ్య కోపంతో నెట్టేయడం, బాలయ్య చేసిన పనికి అతని సెల్ ఫోన్ కింద పడిపోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానుల పట్ల బాలయ్య ఇలా ప్రవర్తించడంపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి.

అభిమానులతో కలిసి సినిమా చూడ్డానికి శాతకర్ణి చిత్రం బృందం హైదరాబాద్‌లోని భ్రమరాంబిక థియేటర్‌కు వెళ్లిన సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాలయ్యతో నెట్టివేయబడ్డ హర్ష అనే అభిమాని స్పందించారు. ఇందులో బాలయ్య తప్పేమీ లేదని, తప్పంతా తానదే అంటూ వివరణ ఇచ్చారు.

యాంటీగా చూపిస్తున్నారు

యాంటీగా చూపిస్తున్నారు

కొందరు ఈ సంఘటనను బాలయ్యకు యాంటీగా చూపిస్తున్నారు. అక్కడ జరిగింది ఒకటైతే, బయటకు చెబుతున్నది మరొకటి. బాలయ్య బాబు అభిమానిగా ఈ సంఘటనపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది అంటూ అసలు విషయం చెప్పుకొచ్చారు సదరు అభిమాని.

ఆయన కాలు తొక్కాను, తప్పు నాదే

ఆయన కాలు తొక్కాను, తప్పు నాదే

బాలయ్య బాబు వస్తున్నాడని ఎంతో ఉత్సాహంతో బ్రమరాంభ థియేటర్ కు సినిమాకు వెళ్లడం జరిగింది. అక్కడ బాలయ్య బాబును చూడగానే ఎంతో ఉత్సాహంతో ఫోటో తీసుకోవానికి వెళ్లాను. ఆ ఉత్సాహంలో పొరపాటున ఆయన కాలు తొక్కడం జరిగింది. అపుడు బాగా రష్ ఉంది... నేను కాలు తెక్కగానే బాలయ్య నా చెయ్యి తోసారు. దీంతో ఫోన్ జారి కింద పడింది అని తెలిపారు. ఈ సంఘటనను కొందరు యాంటీ అభిమానులు రికార్డ్ చేసి నెగెటివ్ గా ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

rn

నన్ను కొట్టలేదు

బయట ప్రచారం జరుగుతున్న బాలయ్య బాబు నన్ను అసలు కొట్టలేదు, నా ఫోన్ పగల కొట్టలేదు. సినిమా హిట్టయింది... ఏమీ చేయలేక కొందరు ఇలా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ ఎవరూ ఇలాంటివి నమ్మడం లేదు. బాలయ్య బాబు ఎలాంటోడో మా అభిమానులకు తెలుసు అని సదరు అభిమాని చెప్పుకొచ్చారు.

rn

అభిమానులే శ్రీరామ రక్ష

బాలయ్య బాబుకు అభిమానులంటే అభిమానం లేకుంటే అభిమానులతో ఆడియో లాంచ్ చేయించే వారు కాదు. ఇలాంటి నెగెటివ్ ప్రచారం చేయడం వల్ల బాలయ్య బాబును ఏదో చేద్దామనుకుంటారు కానీ బాలయ్య బాబును ఏమీ చేయలేరు. బాలయ్య బాబుకు అభిమానులే శ్రీరామరక్ష అని సదరు అభిమాని చెప్పుకొచ్చారు.

English summary
Balakrishna Fan Harsha Gives clarity, What Happens When he take Selfie with NBK Check out full details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu