»   » డైరక్టర్ క్రిష్ ఆఫీసు దగ్గర బాలయ్య అభిమానుల ఆందోళన, వారి డిమాండ్ ఏంటంటే

డైరక్టర్ క్రిష్ ఆఫీసు దగ్గర బాలయ్య అభిమానుల ఆందోళన, వారి డిమాండ్ ఏంటంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సంక్రాంతి పండక్కి నందమూరి బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో తెలుగు సినీ ప్రేక్షకులకు సిసలైన విందు భోజనం వడ్డించబోతున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈనెల 12న విడుదల చేయడానికి చిత్రబృందం అన్ని ఏర్పాట్లు చేసుకొంటోంది.

దర్శకుడు క్రిష్ ఆఫీసు ఎదుట బాలకృష్ణ అభిమానులు ఆందోళనకు దిగారు. ఈ నెల 11వ తేదీనే శాతకర్ణి సినిమాను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం నిర్ణయం తీసుకుందామని బాలయ్య అభిమానులకు శాతకర్ణి చిత్ర నిర్మాత సాయిబాబు వివరించారు.


ఈ నెల 11న చిరంజీవి నటించిన ఖైదీ నం.150 చిత్రం విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శాతకర్ణి సినిమాను ఈనెల 12వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. బాలయ్య అభిమానులు మాత్రం 11వ తేదీనే శాతకర్ణిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Balakrishna Fans Stage Agitation Infront Of Krish's Office

ఇక ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఇద్దరు లెజెండ్స్‌ను స్వాగతిద్దామని దర్శకుడు అన్నారు. చిరంజీవి 'ఖైదీ నంబర్‌ 150', బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాలు జనవరి 11న, 12న వరసగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ సందర్భంగా క్రిష్‌ ఓ ట్వీట్‌ చేశారు.


'ఈ సంక్రాంతికి ఇద్దరు లెజెండ్స్‌ వినోదం పంచడానికి గొప్ప చిత్రాలతో వస్తున్నారు. వారిని ట్రెండింగ్‌లో ఉంచి స్వాగతిద్దాం' అంటూ.. 'జనవరి 11 ఖైదీ', 'జనవరి 12 జీపీఎస్‌కే' అనే హ్యాష్‌ట్యాగ్‌లను జతచేశారు.
శ్రియ, హేమమాలిని, కబీర్‌ బేడీ ప్రధాన పాత్రల్లో నటించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో కొణిదెల పొడ్రక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ 'ఖైదీ నంబర్‌ 150' చిత్రాన్ని నిర్మించారు.


Balakrishna Fans Stage Agitation Infront Of Krish's Office

ఈనెల 8న 'శాతవాహన పతాకోత్సవం' పేరుతో చిత్రబృందం ఓ వేడుక నిర్వహించనుంది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న వంద థియేటర్లలో ఒకేసారి శాతవాహన పతాకం ఎగరేస్తారు. ఆ రోజు సాయంత్రం 5గం.40 నిమిషాలకు విశాఖపట్నంలోని జ్యోతి థియేటర్‌ వద్ద ఈ జెండా పండుగని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, క్రిష్‌తో పాటు మిగిలిన చిత్ర బృందం పాలుపంచుకోనుంది. మిగిలిన 99 థియేటర్లలో అభిమానులే ఈ వేడుక నిర్వహిస్తారు.


''ఆనాడు శాతకర్ణి తన విజయపరంపరకు ప్రతీకగా ఒకే రోజు, ఒకే సమయంలో దేశంలోని కోటలన్నింటిపైనా శాతవాహన పతాకం ఎగురవేయించాడు. ఆ రోజే ఉగాది అయ్యింది. ప్రతి రాష్ట్రంలోనూ వేర్వేరు పేర్లతో ఇప్పటికీ పండుగలా జరుపుకొంటున్నారు. ఆ స్ఫూర్తితోనే పతాకోత్సవం నిర్వహిస్తున్నాం. ఇది రాబోయే విజయానికి సూచిక'' అని చిత్రబృందం తెలిపింది.

English summary
Requesting release of Gautamiputra Satakarni(GPSK) on Jan 11 instead of Jan 12, Nandamuri Balakrishna's fans stage agitation in front of GPSK's director Krish's Office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu