»   »  కూతురు పెళ్లి : కొత్తసొగబులతో బాలయ్య నివాసం

కూతురు పెళ్లి : కొత్తసొగబులతో బాలయ్య నివాసం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూతురు తేజస్విని వివాహం ఈ నెల 21న జరుగనున్న నేపథ్యంలో బాలయ్య నివాసం సొత్తసొగబులు అద్దుకుంది. మరో వైపు వివాహ వేదిక కోసం ప్రముఖ సినీ కళా దర్శకుడు ఆనందసాయి ఆధ్వర్యంలో హైటెక్స్‌లో భారీ సెట్టింగ్ వేసారు.

విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు మనవడైన శ్రీభరత్‌తో తేజస్విని వివాహ జరుగబోతోంది. నిశ్చితార్థం ఇటీవల బాలయ్య ఇంట్లో జరగింది. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఈ నెల 21వ తేదీ ఉదయం 8:52 గంటలకు వివాహం జరపనున్నారు.

సినీ నటుడు బాలకృష్ణ తన కుమార్తె వివాహానికి అభిమానులందరినీ ఆహ్వానించారు. నందమూరి కుటుంబ అభిమానులంతా పెళ్లికి రావాలని పత్రికాముఖంగా విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని వివాహం భరత్‌తో ఈనెల 21న ఉదయం 8:25 నిమిషాలకు మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరగనుంది. పత్రికా ప్రకటననే వ్యక్తిగత ఆహ్వానంగా భావించాలని కోరారు.

English summary
Tollywood actor Nandamuri Balakrishna house new look. The wedding ceremony of Balakrishna’s younger daughter, Tejaswini, will take place at HITEX, and special preparations are already underway. Art director Anand Sai readied a massive and grand set for the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu