»   » హిందూపురంలో సొంతిల్లు కోసం బాలయ్య ఏర్పాట్లు!

హిందూపురంలో సొంతిల్లు కోసం బాలయ్య ఏర్పాట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్‌లో నివాసం ఉండే బాలయ్యను గెలిపిస్తే మళ్లీ నియోజకవర్గం మొహం చూస్తారా? అనే ప్రత్యర్థి పక్షాల విమర్శలకు చెక్ పేట్టుందుకు స్థానికంగా సొంతిల్లు ఏర్పాటు చేసుకుందుకు బాలయ్య ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఇప్పటికే బాలయ్య కొన్ని ఇళ్లను పరిశీలించారు. అయితే చివరగా సూగురు ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో స్థలంకొనుగోలు చేసి ఇల్లు కట్టుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే ఇంట్లో నియోజకవర్గ పార్టీ కార్యాలయంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఓ వైపు ఇల్లు, మరో వైపు పార్టీ కార్యాలయానికి అనుకూలంగా ఉండేలా ఈ ఇంటిని నిర్మించబోతున్నారట.

 Balakrishna is house hunting in Hindupur

ఎమ్మెల్యేగా గెలిస్తే స్థానికంగా ఉండి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తానని, నియోజకవర్గంలో లేని సమయంలో కార్యదర్శి ద్వారా పనులు సమీక్షిస్తానని బాలయ్య స్థానికులకు మాట ఇస్తున్నారట. హిందూపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోట కావడంతో తన గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు బాలయ్య.

కాగా...బాలయ్యను గెలిపించేందుకు తెలుగుదేశం పార్టీ వర్గాలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కృషి చేస్తున్నారు. ఇప్పటికే బాలయ్య పెద్ద అల్లుడు లోకేష్, చిన్న అల్లు అల్లుడు శ్రీభరత్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. బాలయ్య పెద్ద కుమార్తె బ్రహ్మాని సైతం స్థానిక మహిళలో సమావేశం కాబోతున్నారని తెలుస్తోంది.

English summary
Actor Balakrishna is house hunting in Hindupur. He will contest from Hindupur assembly seat.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu