»   » పూరి బ్యాచ్‌తో కలిసి లేట్ నైట్ పార్టీలో బాలయ్య ... (ఫోటోస్ వైరల్)

పూరి బ్యాచ్‌తో కలిసి లేట్ నైట్ పార్టీలో బాలయ్య ... (ఫోటోస్ వైరల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

'పైసా వసూల్' టీం ఇపుడు చాలా హ్యాపీగా ఉంది. అనుకున్న సమయం కంటే సినిమాను 5 వారాల ముందే రిలీజ్ చేస్తుండటం, దాంతో పాటు ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు సినిమాపై హైప్ ఓ రేంజిలో వచ్చేసింది. సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఈ సంతోషంలో ఇటీవల పూరి టీం పార్టీ చేసుకున్నారు.

పూరి బ్యాచ్

పూరి బ్యాచ్

పూరి జగన్నాథ్ అండ్ బ్యాచ్ తమ సినిమా షూటింగులు ఉ న్నంత కాలం అలుపు లేకుండా కష్టపడతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి తర్వాత పార్టీల్లో రిలాక్స్ అవుతూ ఉంటారు. ‘పైసా వసూల్' విషయంలోనూ అలాంటి పార్టీనే ఇటీవల జరిగింది.

పార్టీలో బాలయ్య కూడా

పార్టీలో బాలయ్య కూడా

‘పైసా వసూల్' ఆడియో సక్సెస్ మీట్ ఇటీవల ముగిసిన తర్వాత అదే రోజు రాత్రి పూరి అండ్ బ్యాచ్ చిన్న పార్టీ చేసుకున్నారు. లేట్ నైట్ వరకు సాగిన ఈ పార్టీలో పూరి జగన్నాథ్, చార్మి, సినిమాలోని హీరోయిన్లు పాల్గొన్నారు. సాధారణంగా ఇలాంటి పార్టీలకు దూరంగా ఉండే బాలయ్య కూడా ఈ పార్టీలో జాయిన్ కావడం గమనార్హం.

ఫోటోలు వైరల్

ఫోటోలు వైరల్

బాలయ్య పార్టీలో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పార్టీకి సంబంధించిన ఓ ఫోటో బాలయ్య విగ్గు లేకుండా ఉండటం గమనార్హం.

పైసా వసూల్

పైసా వసూల్

భవ్య క్రియేషన్స్‌ బేనర్‌పై వి.ఆనంద ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'పైసా వసూల్‌'. శ్రియ, కైరా, ముస్కాన్‌ హీరోయిన్లు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్ 1న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సెన్సార్ రేటింగ్

సెన్సార్ రేటింగ్

‘పైసా వసూల్' చిత్రానికి సెన్సార్ నుండి యూ/ఎ రేటింగ్ వచ్చింది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ చిత్రంగా సెన్సార్ రేటింగ్ రావడంతో చిత్ర యూనిట్ ఆనందంగా ఉంది. బాలయ్య కెరీర్లోనే ఈ చిత్రం అతిపెద్ద హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారంతా.

English summary
An After-Party was thrown post the audio success meet of 'Paisa Vasool' on Sunday. Usually, Balakrishna doesn't prefer such late-night parties but he can't say no as the whole unit of 'Paisa Vasool' bonded well during the making.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu