»   » అంత సీన్ లేదు: బిగ్ బాస్ ఇంట్లోకి బాలయ్య, మహేష్ బాబు నో!

అంత సీన్ లేదు: బిగ్ బాస్ ఇంట్లోకి బాలయ్య, మహేష్ బాబు నో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనంలా దూసుకెలుతున్న షో 'బిగ్ బాస్' రియాల్టీ షో. హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగుతో ఈ షో సాగుతుండటంతో కొందరు స్టార్లు తమ సినిమాల ప్రమోషన్స్ కోసం బిగ్‌బాస్ ఇంటికి వస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే 'నేనే రాజు నేనే మంత్రి' ప్రమోషన్ కోసం రానా, 'ఆనందో బ్రహ్మ' ప్రమోషన్ కోసం తాప్సీ, 'అర్జున్ రెడ్డి' మూవీ ప్రమోషన్ కోసం విజయ్ దేవరకొండ 'బిగ్ బాస్' ఇంటికి వచ్చి సందడి చేశారు.

బాలయ్య వస్తున్నాడంటూ ప్రచారం

బాలయ్య వస్తున్నాడంటూ ప్రచారం

సెప్టెంబర్ 1న బాలయ్య నటించిన ‘పైసా వసూల్' చిత్రం విడుదలవుతుండటంతో సినిమా ప్రమోషన్లో భాగంగా బాలయ్య ‘బిగ్ బాస్' ఇంటికి వస్తాడంటూ ప్రచారం మొదలైంది.

అబ్బాయ్, బాబాయ్ ముచ్చటిస్తారట

అబ్బాయ్, బాబాయ్ ముచ్చటిస్తారట

‘బిగ్ బాస్' ఇంటికి బాలయ్య వస్తున్నారని, ఈ సందర్భంగా అబ్బాయ్ ఎన్టీఆర్‌తో బాబాయ్ ముచ్చటిస్తారని ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాదు ‘స్పైడర్' సినిమా ప్రచారానికి మహేష్ బాబు కూడా వస్తాడంటూ పుకార్లు మొదలయ్యాయి.

అంత సీన్ ఉందా?

అంత సీన్ ఉందా?

బాలయ్య, మహేష్ బాబు స్థాయి హీరోలు బిగ్ బాస్ ఇంటికి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాళ్ల స్థాయి వేరని, బిగ్ బాస్ లాంటి షోలకు వచ్చి సినిమా ప్రమోట్ చేసుకునే స్థితిలో వారు లేరని మరికొందరి వాదన.

గతంలో ఏ షోకూ రాలేదు

గతంలో ఏ షోకూ రాలేదు

గతంలో తెలుగు టీవీ రంగంలో చాలా షోలో జరిగాయి. ఆ సమయంలో ఏదైనా సినిమా విడుదలైతే, అందులోని స్టార్లు ఆయా షోలకు, టీవీ ఛానల్స్ చర్చా కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవారు. వాళ్లంతా మామూలు స్థాయి హీరోలు. కానీ బాలయ్య, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్లు గతంలో తమ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి ఏ కార్యక్రమానికి, ఏ టీవీ ఛానల్‌కు రాలేదు.

English summary
Balayya had a live chat with his fans in Facebook and promoted his film Paisa Vasool. So many thought that Balayya turned tech savvy and would also promote his film in Bigg Boss. But it is not the case. It is learnt that Balayya's Bigg Boss entry turned out to be false as the Legend actor is not keen at all.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu