»   » బాలయ్య ‘పరమవీరచక్ర’ పై దర్నాకు దిగిన సైనికోద్యోగులు..?

బాలయ్య ‘పరమవీరచక్ర’ పై దర్నాకు దిగిన సైనికోద్యోగులు..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ హీరోగా లెజండ్రి దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పరమవీరచక్ర సినిమాకి టైటిల్ వివాదం ఇంకా ఇంకా ముదురుతోంది. దేశం కోసం ప్రాణాలర్పించడానికి సిద్దమయ్యే సైనికులు పరమ పవిత్రంగా భావించే 'పరమవీరచక్ర" పురస్కారం పేరును సినిమా టైటిల్ గా పెట్టడమేంటంటూ సైనికోద్యోగులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోన్న సంగతి విధితమే. ఈ విషయమై ఇప్పటిదాకా సినిమా యూనిట్ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో, పలువురు సైనికోద్యోగులు, మాజీ సైనికోద్యోగులు ఫిలిం ఛాంబర్ ఎదుట నిన్న ధర్నా అందోళనా కార్యక్రమాన్ని నిర్వహించారు.

వెంటనే 'పరమవీర చక్ర" టైటిట్ ని మార్చాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయడంతోపాటు, కోర్టుకెక్కడానికి వెనుకాడబోమని సైనికోద్యోగుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అయితే సినిమా విడుదలయ్యే నాటికి ఈ గొడవలన్నీ వాటంతట అవే సద్దుమణిగిపోతాయని సినిమా యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క, వివాదం ముదిరితే టైటిల్ మార్చే ఆలోచనలోనూ దాసరి, బాలయ్య వున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలనే 'జయసింహ" అనే మరో టైటిల్ నీ దాసరి ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయడం గమనార్హం. మొత్తమ్మీద, తూతూమంత్రంగా కాకుండా, 'పరమవీరచక్ర" టైటిల్ విషయమై సైనికోద్యోగులు చాలా సీరియస్ గానే ఆందోళన చేసడ్తున్నట్టు కన్సిస్తోంది.

సినిమాలకు వివాదాలు కొత్తేమీ కాకపోయినా సైనికుల ఆవేదన ఒకరకంగా సమంజసమే కాబట్టి, 'పరవీరచక్ర" టైటిల్ విషయమై చిత్ర యూనిట్ పునరాలోచనలో పడి, టైటిల్ మార్చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu