»   » బాలయ్య ఫస్ట్ లుక్ అదుర్స్.. పూరీ సినిమా టైటిల్ ఇదే.. ఫ్యాన్సుకు పండుగే పండుగ!

బాలయ్య ఫస్ట్ లుక్ అదుర్స్.. పూరీ సినిమా టైటిల్ ఇదే.. ఫ్యాన్సుకు పండుగే పండుగ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటసింహం నందమూరి బాలకృష్ణను ఆయన జన్మదినం రోజున కలువలేకపోతున్నామని అభిమానులు నిరాశగురయ్యారు. ఎందుకంటే బాలయ్య ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య ఆర్ట్ క్రియేషన్ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ చిత్రం షూటింగ్ కోసం బాలయ్య కొద్ది రోజులుగా పోర్చుగల్‌లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. కాబట్టి ఈ ఏడాది పుట్టిన రోజును దర్శకుడు పూరీ, నిర్మాత, చిత్ర యూనిట్ సమక్షంలోనే జరుపుకోవడానికి సిద్ధమయ్యాడు. పుట్టిన రోజును పురస్కరించుకొని తన అభిమానులను నిరాశపరచుకుండా తన సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. పైసా వసూల్ అనే టైటిల్‌ను ప్రకటించి పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేశారు.

 57 ఏట అడుగుపెడుతున్న బాలయ్య

57 ఏట అడుగుపెడుతున్న బాలయ్య

ఇటీవల 100 చిత్రాలను పూర్తి చేసుకొన్న బాలకృష్ణ 57 ఏట అడుగుపెడుతున్నాడు. తన 101వ చిత్రంగా పూరీ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. పూర్తి మాస్, కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషిస్తున్నారు.

పోర్చుగల్‌లో పూరీ సినిమా షూటింగ్

పోర్చుగల్‌లో పూరీ సినిమా షూటింగ్

పోర్చుగల్‌లో జరుగుతున్న షూటింగ్‌లో బాలయ్య సెన్సేషనల్ క్రియేట్ చేశారు. ఎలాంటి డూప్ లేకుండానే చేజింగ్ సీన్‌ను స్వయంగా పూర్తి చేసి తన సత్తా ఏంటో నిరూపించారు. ప్రమాదకరమైన రీతిలో సాగే కారు డ్రైవింగ్‌ను డూప్ లేకుండా చేయడం తన హీరోయిన్ శ్రీయతో చిత్ర యూనిట్‌ను ఆశ్చర్యానికి గురిచేశారు.

శనివారం పోర్చుగల్ నుంచి లైవ్

శనివారం పోర్చుగల్ నుంచి లైవ్

ప్రస్తుతం పోర్చుగల్‌లో బాలయ్య ఉన్నందున తన జన్మదిన వేడుకలను శనివారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఫేస్‌బుక్‌లో లైవ్ ద్వారా ప్రసారం చేయనున్నారు. ఇందుకోసం జాతీయస్థాయిలో సోషల్ మీడియా ఆధారంగా కార్యక్రమాలను నిర్వహించే సంస్థను రంగంలోకి దించినట్టు సమాచారం.

కథకు ఈ టైటిల్ యాప్ట్

కథకు ఈ టైటిల్ యాప్ట్

పైసా వసూల్ టైటిల్, ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాధ్ మాట్లాడుతూ ‘పైసా వసూల్ అనే టైటిల్ ఈ కథ కు యాప్ట్. కచ్చితం గా బాలకృష్ణ గారి ఫాన్స్, ఆడియన్స్ ఫుల్ ఖుష్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. బాలకృష్ణ గారితో పని చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీ గా వుంది. ఈ సినిమా లో ఆయన చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. ఆయన డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఫెంటాస్టిక్ గా ఉంటాయి. ఈ మధ్య కాలం లో బాలకృష్ణ గారు సీరియస్ టైపు రోల్స్ చేస్తున్నారు. ఇందులో మాత్రం ఎంటర్టైన్మెంట్ రోల్ చేస్తున్నారు. నిజం గా అభిమానులకి పండుగే ఈ సినిమా.యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కొన్నియాక్షన్ ఎపిసోడ్స్ లో ఫారిన్ సాంకేతిక నిపుణులు మరియు ఫైట్ మాస్టర్స్ పని చేసారు అని తెలిపారు.

అంచనాలకు తగినట్టే సినిమా

అంచనాలకు తగినట్టే సినిమా

నిర్మాత వీ ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ "నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చెయ్యగానే విపరీతమయిన అంచనాలు పెరిగిపోయాయి. సినిమా కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. టైటిల్ కి తగ్గట్టుగానే మంచి పైసా వసూల్ సినిమా అవుతుంది. మే 12 నుంచి పోర్చుగల్ లో ని లిస్బన్ , పోర్టో సిటీల లో ఇంతవరకు ఎవరు చెయ్యని లొకేషన్స్ లో షూటింగ్ చేస్తున్నాము. ఈ నెల 16 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది అని తెలిపారు.

ఫేస్‌బుక్ లైవ్‌లో బాలయ్య

ఫేస్‌బుక్ లైవ్‌లో బాలయ్య

బాలకృష్ణ గారి పుట్టిన రోజు సందర్భం గా శనివారం మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల నుండి ఫేస్ బుక్ లో లైవ్ ఏర్పాటు చేసాం . బాలకృష్ణ గారు మరియు పూరి జగన్నాధ్ గారు ఈ లైవ్ లో పాల్గొని అభిమానులని ఆనందపరుస్తారు. బాలకృష్ణ గారు పాల్గొనే ఫస్ట్ ఫేస్ బుక్ లైవ్ ఇదే. అలాగే విదేశాల నుంచి ఫేస్ బుక్ లో లైవ్ జరుపుకునే తొలి తెలుగు సినిమా కూడా ఇదే. భవ్య క్రియేషన్ ఫేస్ బుక్ పేజీ లో ఈ లైవ్ ని వీక్షించవచ్చును. బాలకృష్ణ గారి 101వ చిత్రం గా రూపొందుతున్న ఈ చిత్రం లో శ్రేయ, ముస్కాన్, కైరా దత్తు హీరోయిన్లు గా నటిస్తునారు" అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం; అనూప్ రూబెన్స్.

పైసా వసూల్ టైటిల్ అదిరింది

పైసా వసూల్ టైటిల్ అదిరింది

పూరీ, బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రానికి అనేక రకాల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తేడా సింగ్, గ్యాంగ్‌స్టర్, ఉస్తాద్ అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. చివరకు పైసా వసూల్ అనే పేరు ఖరారు చేశారు.

విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్

విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్

నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. కెరీర్ ఆరంభంలోనే కళాతపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో జననీ జన్మభూమి అనే సినిమాలో విలక్షణమైన పాత్రను పోషించారు. ఇమేజ్‌ను పట్టించుకోకుండా భైరవద్వీపం, పాండురంగడు, శ్రీరామదాసు చిత్రాల్లో నటించారు. తన వందో చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి నటించి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు.

English summary
Nandamuri Balakrishna is celebrating his 57th birthday on June 10. Now Balaiah is busy with Puri Jagannadh's project in Portugal. On the occassion of his birthday, Bhavya Arts creation banner, film unit released his first look of Puri movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu