twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడు చేతులు వణికాయి :బాలకృష్ణ

    By Srikanya
    |

    హైదరాబాద్ :నాకు మరిచిపోలేని సంఘటనలు రెండున్నాయి. ఒకటి 'అన్నదమ్ముల అనుబంధం' సినిమాలో నాన్నగారితో కలిసి నటించటం. ఈ సినిమాలో నాన్నగారు సిగరెట్టు నోట్లో పెట్టుకుంటే లైటర్‌తో వెలిగించే సీను ఒకటుంటుంది. ఆ సీను చేస్తున్నప్పుడు చేతులు వణికాయి. ఆ సినిమాలో నాన్నగారికి పెద్ద మీసం లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా చేతుల వణుకుడికి ఆయన మీసాలు కాలిపోయేవి అంటూ గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ.

    ఇక రెండోది 'కర్ణ'లో నేను వేసిన వేషం. ఇది నా తొలి పౌరాణికం. అప్పటి దాకా నేను పౌరాణికాలకు సరిపోతానా? లేదా అనే అనుమానం ఉండేది. ఈ సినిమాలో బావున్నానని అందరూ కాంప్లిమెంట్స్‌ ఇవ్వటంతో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి అన్నారు.

    Balakrishna remembers his earlier days

    అలాగే ...నా సినిమా అంటే పదునైన సంభాషణలు ఆశిస్తారు. ఈ విషయంలో పాత్రలు, కథలు ఇచ్చిన స్ఫూర్తితోనే సంభాషణలుంటాయి. అంతేగానీ రచయితలకు చెప్పి రాయించుకోవడాలు ఉండవు. 'సింహా', లెజెండ్‌' సినిమాల్లోని సంభాషణలు జనంలోకి బాగా వెళ్లాయి. ఐదారేళ్ల చిన్నపిల్లలూ ఆ సంభాషణలు పలుకుతున్నారు... తొడలు కొడుతున్నారు.. (నవ్వుతూ). సంభాషణలో ఏముంది? అనేది పక్కన పెట్టండి. కనీసం మన తెలుగు తెలుగులా మాట్లాడుతున్నారు అని చెప్పుకొచ్చారు.

    డైలాగు పవర్ గురించి చెప్తూ... సంభాషణలు, పాటల రూపంలో మంచి తెలుగు అందివ్వగలుగుతున్నాం. మేం చేయగలిగేది అదే కదా. నాన్నగారినే తీసుకోండి. తెలుగు భాష విషయంలో ఆయన తీసుకొన్న శ్రద్ధ అంతా ఇంతా కాదు. ఒక్కో పాత్రకూ ఒక్కో తరహా భాష. 'దాన వీర శూర కర్ణ'లాంటి పౌరాణిక సినిమాల్లోని డైలాగులు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. ఏ ప్రేక్షకుడైనా తొలిసారి ఆ డైలాగుల్ని శ్రద్ధతో వింటాడు. రెండోసారి విన్నప్పుడు అందులో ఏముందో తెలుసుకొంటాడు. మూడోసారి తనో ఎన్టీఆర్‌లా మారి.. ఆ డైలాగులు పలికేస్తాడు. డైలాగ్‌కి ఉన్న పవర్‌ అది అన్నారు.

    English summary
    Nandamuri Balakrishna happy to remember his earlier days with his father NTR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X