twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు ఆ ఆలోచనే లేదు.. నిమ్మకూరు వెళ్ళగానే నోటి నుంచి వచ్చేసింది.. బాలయ్య!

    |

    Recommended Video

    NTR Bio Pic Updates : Balakrishna Talks About Ntr Movie Announcement | Filmibeat Telugu

    సంక్రాంతికి విడుదల కాబోతున్న భారీ చిత్రాలలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి. బాలయ్య స్వయంగా ఈ చిత్రంలో తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండడంతో ప్రాధాన్యత నెలకొంది. ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగ విశేషాలు వెండి తెరపై చూసేందుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తొమ్మిది మంది హీరోయిన్లు, రానా, సుమంత్ లాంటి స్టార్స్ నటిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో బాలయ్య ప్రచార కార్యక్రమాలు షురూ చేశాడు.

    నాకు ఆ ఆలోచనే లేదు

    నాకు ఆ ఆలోచనే లేదు

    బాలయ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తనకు మొదట ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించాలనే ఆలోచన లేదని బాలయ్య తెలిపాడు. ఏడాది క్రితం నిమ్మకూరు వెళ్ళా. మా అల్లుడు లోకేష్ అక్కడ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభిస్తుంటే అక్కడకు వెళ్ళా. మీడియాకు ఎన్టీఆర్ బయోపిక్ చేయబోతున్నట్లు చెప్పాను. నా ప్రమేయం లేకుండానే ఆ మాట వచ్చిందని బాలయ్య తెలిపాడు.

    పాయల్ రాజ్‌పుత్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్‌లో ఉత్తమ విలన్ ఎవరు.. ఓటేసి మీరే డిసైడ్ చేయండి!పాయల్ రాజ్‌పుత్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్‌లో ఉత్తమ విలన్ ఎవరు.. ఓటేసి మీరే డిసైడ్ చేయండి!

     నిమ్మకూరు మహిమ

    నిమ్మకూరు మహిమ

    అంతకు ముందు చాలా రోజులక్రితం విష్ణు ఇందూరి నన్ను కలిసాడు. ఎన్టీఆర్ బయోపిక్ రఫ్ గా నాతో చెప్పాడు. అప్పటికి కథ కూడా సిద్ధం కాలేదు. ఇలాంటి ఆలోచన ఉందని మాత్రమే తనతో చెప్పాడు. సరే చూద్దాం లే అని పంపించి వేశా. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ గురించి మళ్ళీ పట్టించుకోలేదు. స్థల మహిమ ఏమో కానీ నిమ్మకూరులో అడుగు పెట్టగానే నా నోటి నుంచి ఎన్టీఆర్ బయోపిక్ మాట వచ్చిందని బాలయ్య తెలిపాడు.

    కథపై చర్చ

    కథపై చర్చ

    బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటించగానే సినీ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా హాట్ హాట్ చర్చ మొదలైంది. ఎన్టీఆర్ బయోపిక్ లో ఎలాంటి అంశాలు చూపిస్తారు. ఎన్టీఆర్ తుదిశ్వాస విడిచే వరకు కథ ఉంటుందా అనే చర్చ మొదలైంది. బాలయ్య కూడా రామారావు గారితో పరిచయం ఉన్న ప్రముఖుల్ని కలసి ప్రపంచానికి ఆయన గురించి తెలియని విశేషాలు తెలుసుకుని కథ సిద్ధం చేయించారు.

     భారీ బడ్జెట్, తారాగణం

    భారీ బడ్జెట్, తారాగణం

    ఈ చిత్రంలో బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా, మరో ఆసక్తికరమైన పాత్ర చంద్రబాబు రోల్ లో దగ్గుబాటి రానా నటిస్తున్నాడు. సుమంత్ ఏఎన్నార్ గా కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ సతీమణిగా విద్యాబాలన్, సావిత్రి పాత్రలో నిత్య మీనన్, శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ ఇలా తొమ్మిది మంది హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలయ్య ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని రూపొందించారు. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Balakrishna reveals interesting facts about NTR Biopic
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X