Don't Miss!
- News
వేగం పెరిగింది: సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయంలో కేంద్రమంత్రి జైశంకర్
- Sports
టీ20లకు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయరో నాకైతే అస్సలు తెలియదు.. శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Finance
8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక ప్రకటన.. డీఏ పెంపుపై కుండబద్ధలు కొట్టిన కేంద్ర మంత్రి..
- Lifestyle
ఈ లక్షణాలు ఉంటే మీ మెదడు వయసు మీకంటే పెద్దదని అర్థం...!
- Technology
రాబోయే Vivo ఫోల్డబుల్ మొబైల్స్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా!
- Automobiles
భారతీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టిగోర్ XM iCNG': ధర & వివరాలు
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
Akhanda: బాలకృష్ణ ఖాతాలో సెన్సేషనల్ రికార్డు.. ఇండియాలోనే ఏకైక హీరోగా ఘనత
'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత నుంచి విజయాన్ని అందుకోవడంలో తడబడుతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. దీని తర్వాత ఆయన వరుస పెట్టి ఎన్నో సినిమాలు చేశారు. కానీ, అవేమీ ఆయనను సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి గట్టిగా కొట్టాలని డిసైడ్ అయిన బాలయ్య.. గతంలో తనకు రెండు భారీ విజయాలను అందించిన బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే సినిమాను చేశారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. థియేటర్లలో దాదాపు యాభై రోజుల పాటు సందడి చేసిన తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ సెన్సేషనల్ రికార్డును అందుకుంది. ఆ వివరాలు మీకోసం!

‘అఖండ'గా బాలయ్య అరాచకం
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన చిత్రమే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీకాంత్ నెగెటివ్ రోల్‌ను చేశాడు. ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు. ఇది అఖండమైన విజయాన్ని అందుకుంది.
మళ్లీ బికినీలో రచ్చ చేసిన పూజా హెగ్డే: ఈ సారి తడిచిన అందాలతో అంతకు మించి!

హాఫ్ సెంచరీతో మరో రికార్డ్ కూడా
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' మూవీ ఇటీవలే యాభై రోజులు పూర్తి చేసుకుంది. అది కూడా ఏకంగా 105 సెంటర్లలో ఈ ఫీట్‌ను అందుకుంది. తద్వారా ఈ మధ్య కాలంలో ఎక్కువ థియేటర్లలో యాభై రోజులు ఆడిన చిత్రంగా రికార్డు నమోదు చేసింది. అలాగే, ఈ ప్రయాణంలో హీరో బాలయ్య ఖాతాలో ఎన్నో అరుదైన రికార్డులు కూడా వచ్చి చేరిన సంగతి తెలిసిందే.

కెరీర్ బెస్ట్ కలెక్షన్లతో నయా రికార్డు
బాలయ్య కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'అఖండ'కు అంచనాలకు తగ్గట్లే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 50 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 74.58 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా రూ. 20.58 కోట్లు లాభాలను కూడా అందుకుని రికార్డులు నెలకొల్పేసింది.
మరోసారి రెచ్చిపోయిన దిశా పటానీ: ఈ సారి అలా పడుకుని మామూలు రచ్చ కాదుగా!

ఓటీటీలో రిలీజ్... అక్కడా సక్సెస్
'సింహా',
'లెజెండ్'
తర్వాత
నందమూరి
బాలకృష్ణ,
బోయపాటి
శ్రీను
కాంబినేషన్‌లో
వచ్చిన
చిత్రమే
'అఖండ'.
ఎన్నో
అంచనాలతో
వచ్చి
థియేటర్లలో
సందడి
చేసిన
ఈ
సినిమా
డిజిటల్
స్ట్రీమింగ్
హక్కులను
డిస్నీ
ప్లస్
హాట్‌స్టార్
సంస్థ
అత్యధిక
ధరకు
సొంతం
చేసుకుంది.
ఇక,
జనవరి
21
నుంచి
స్ట్రీమింగ్
అవుతోన్న
ఈ
మూవీ
ఓటీటీలోనూ
రికార్డులు
బద్దలు
కొడుతోంది.

బాలకృష్ణ ఖాతాలో అరుదైన ఘనత
డిస్నీ
ప్లస్
హాట్‌స్టార్‌లో
స్ట్రీమింగ్
అవుతోన్న
'అఖండ'
మూవీ
మొదటి
రోజే
ఎక్కువ
వ్యూస్‌ను
అందుకున్న
చిత్రంగా
చరిత్ర
సృష్టించిన
విషయం
తెలిసిందే.
తాజాగా
ఈ
సినిమా
మరో
రికార్డును
కూడా
చేరుకుంది.
తాజా
సమాచారం
ప్రకారం..
ఓటీటీలో
మొదటి
వారంలో
ఎక్కువ
వ్యూస్
సాధించిన
ఏకైక
తెలుగు
చిత్రంగా
ఇది
నిలిచిందట.
హాట్‌స్టార్
ఇది
టాప్
ప్లేస్‌కు
చేరినట్లు
తెలిసింది.
బుచ్చిబాబు సినిమాలో కోచ్‌గా ఎన్టీఆర్: కథ, హీరోయిన్‌తో పాటు ముఖ్యమైన వివరాలన్నీ లీక్

నెంబర్ వన్ హీరోగా నిలిచిన స్టార్
దేశ వ్యాప్తంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన చిత్రాల్లో ఎక్కువ వ్యూస్ సాధించడంతో పాటు ఎక్కువ రోజులు ట్రెండింగ్‌లో నిలిచిన వాటిలో 'అఖండ' మొదటి స్థానంలో ఉందని తెలుస్తోంది. జనవరి 22 నుంచి 29 వరకూ ఈ మూవీ టాప్‌లోనే ఉందట. ఇలా ఎక్కువ రోజులు హవా చూపించిన హీరోగా బాలయ్య ఇండియాలోనే మొదటి స్థానానిక చేరుకున్నాడని టాక్.