Don't Miss!
- Sports
India vs Zimbabwe: కాసేపు బాడీ ప్రెజెంట్.. మైండ్ అబ్సెంట్ పరిస్థితి అయిందన్న దీపక్ చాహర్..!
- News
Family: కుటుంబ పెద్దకు క్యాన్సర్, భార్య, కొడుకు ఏమైపోతారో అని భయం, ఒకేసారి ముగ్గురూ ఇంటిలో?!
- Automobiles
మారుతి సుజుకి ఆల్టో కె10 వర్సెస్ రెనో క్విడ్: ఈ రెండు మోడళ్లలో ఏది బెస్ట్..? Alto K10 vs Renault Kwid
- Technology
శ్రీకృష్ణ జన్మాష్టమికి అదిరిపోయే స్టిక్కర్లతో Whatsapp లో విషెస్ చెప్పండి!
- Finance
వీళ్లు మామూలోళ్లు కాదుగా.. బ్యాంకుకు కన్నం వేసేందుకు సొరంగం.. అనుకున్నదొకటి అయ్యిందొకటి..
- Lifestyle
Diet Tips: మీరు ఉదయాన్నే తినే ఈ ఆహారాలే మీ బరువు పెరగడానికి కారణం...!
- Travel
ఒకప్పటి రాజ నివాసాలు.. ఇప్పుడు విలాసవంతమైన విడిది కేంద్రాలు
Akhanda: మరోసారి థియేటర్‌లో అఖండ రిలీజ్.. బాలయ్య రేంజ్ అంటే ఇదే మరి
క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత నుంచి చాలా కాలం పాటు విజయాన్ని అందుకోవడంలో విఫలం అయ్యారు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. ఈ చిత్రం తర్వాత ఆయన వరుస పెట్టి ఎన్నో ప్రాజెక్టులు చేశారు. కానీ, అవేమీ ఆయనను హిట్ ట్రాక్ ఎక్కించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి గట్టిగా కొట్టాలని డిసైడ్ అయిన బాలయ్య.. గతంలో తనకు రెండు భారీ సక్సెస్‌లను అందించిన బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే సినిమాను చేశారు. ఎన్నో అంచనాల నడుమ గత ఏడాది చివర్లో విడుదలైన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. థియేటర్లలో చాలా రోజుల పాటు సందడి చేసి.. ఇప్పుడు మరోసారి విడుదల కాబోతుంది. ఆ వివరాలు మీకోసం!

‘అఖండ’గా బాలయ్య విశ్వరూపం
నటసింహా బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన చిత్రమే ‘అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీకాంత్ నెగెటివ్ రోల్‌ను చేశాడు. థమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు. ఇది అఖండమైన విజయాన్ని దక్కించుకుంది.
Rahul Sipligunj Arrest: రాహుల్ సిప్లీగంజ్ అరెస్ట్.. పోలీసుల అదుపులో మరికొందరు ప్రముఖులు!

100 రోజులు... అరుదైన రికార్డులతో
బాలయ్య కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘అఖండ' మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఈ మూవీ లాంగ్ రన్‌ను సొంతం చేసుకుంది. ఇటీవలే ఇది వంద రోజులు పూర్తి చేసుకుంది. నేరుగా నాలుగు సెంటర్లలతో పాటు మొత్తంగా 20 కేంద్రాల్లో ఈ సినిమా ఈ మైలురాయిని చేరుకుని రికార్డు కొట్టింది.

భారీ కలెక్షన్లతో బాలకృష్ణ ఘనత
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ'కు అంచనాలకు తగ్గట్లే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఫుల్ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 94.27 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. ఫలితంగా రూ. 40.27 కోట్లు లాభాల దక్కించుకుని నయా రికార్డును నెలకొల్పింది.
Malaika Arora: రోడ్డు ప్రమాదానికి గురైన హీరోయిన్.. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే!

ఓటీటీలో రిలీజ్.. అక్కడా హిట్‌గా
రెండు భారీ హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే ‘అఖండ'. ఎన్నో అంచనాలతో వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ అత్యధిక ధరకు సొంతం చేసుకుంది. ఈ మూవీ ఓటీటీలోనూ భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుని ఎన్నో రికార్డులు నమోదు చేసుకుంది.

మళ్లీ థియేటర్‌లో అఖండ రిలీజ్
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అఖండ' మూవీ చాలా రోజుల పాటు థియేటర్లలో సందడి చేసింది. ఆ తర్వాత ఓటీటీలోనూ ఈ సినిమా హవాను చూపించింది. ఇక, త్వరలోనే టీవీల్లోనూ ప్రసారం కాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య నటించిన ఈ సినిమాను మరోసారి థియేటర్‌లో విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Bigg Boss Non Stop: ఐదో వారం షాకింగ్ ఎలిమినేషన్.. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఔట్.. ఆమె మళ్లీ సేఫ్!


బాలయ్య రేంజ్ అంటే ఇదే మరి
నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ' మూవీని ఏప్రిల్ 1వ తేదీ నుంచి రత్న మినీ అనే థియేటర్‌లో విడుదల చేశారు. ఉగాది కానుకగా వచ్చిన దీనికి మంచి స్పందనే దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం వరకే ఇది ప్రదర్శితం కాబోతుందట. ఈ థియేటర్ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో ఉందని అంటున్నారు.