»   » ‘డిక్టేటర్‌' ఎక్కడిదాకా వచ్చారు?

‘డిక్టేటర్‌' ఎక్కడిదాకా వచ్చారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా ‘డిక్టేటర్‌'. బాలకృష్ణ ఉన్న కొన్ని కీలక సన్నివేశాలు తో పాటు, ఫైట్ మాస్టర్ రవివర్మ నేతృత్వంలో క్లయిమాక్స్ ఫైట్ ను హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ అయితే ఓ రెండు పాటలు మినహా, మెత్తం టాకీ పార్ట్ పూర్తవుతుంది.

నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంత కంటే ముందుగా పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, అభిమానులు సమక్షంలో ఆడియో వేడుకను నిర్వహిస్తున్నారు.


ఈ వేడుకను అమరావతి వేదికైంది. ఇటీవల ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా ఇటీవ కాలచక్రను నిర్వహించారు. ఆ కార్యక్రమం తర్వాత అమరావతిలో జరగున్ను వేడుక ‘డిక్టేటర్‌' చిత్ర ఆడియో విడుదల. అంతే కాకుండా అమరావతిలో జరుగనున్న తొలి సినిమా కార్యక్రమం కూడా ఇదే కావడం విశేషం.


Balakrishna's Dictator latest info

నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్‌ ఇంటర్నేషనల్‌,వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్‌ మూవీ ‘డిక్టేటర్‌'. అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష హీరోయిన్స్‌.‘లౌక్యం'వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ అందించిన శ్రీవాస్‌ ఈ చిత్రానికి దర్శకుడు. యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని డిసెంబర్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో నిర్వహిస్తున్నారు.


సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌, కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.

English summary
Dictator unit reveals that a heavy duty climax fight is being shot in Hyderabad currently.
Please Wait while comments are loading...