»   » బాలయ్య ‘డిక్టేటర్’ ప్రారంభోత్సవం (ఫోటోస్)

బాలయ్య ‘డిక్టేటర్’ ప్రారంభోత్సవం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య తన 99వ సినిమా ‘డిక్టేటర్' శుక్రవారం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి లక్ష్యం, లౌక్యం ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇండియాలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలయ్య, అంజలిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రాఘవేంద్రరావు కెమెరా స్విచాన్ చేయగా.... బోయపాటి శ్రీను క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బి గోపాల్, సురేష్ బాబు, అంబిక కృష్ణ, సురేష్ బాబు, కోన వెంకట్, గోపీ మోహన్, సత్యదేవ్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, ఆర్.పి.పట్నాయక్, ధశరత్, జెమిని కిరణ్ తదితరులు హాజరయ్యారు.


All Photos : Dictator Movie Launch


స్లైడ్ షోలో సినిమా గురించి వివరాలు, ఫోటోలు...


సినిమా గురించి బాలయ్య

సినిమా గురించి బాలయ్య

సినిమా గురించి బాలయ్య మాట్లాడుతూ...‘నా 99వ సినిమా డిక్టేటర్. డైరెక్టర్ శ్రీవాస్ నా దగ్గరకు మంచి కథతో వచ్చాడు. ఈరోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. వారితో పని చేయడం హ్యాపీగా ఉంది.


కొత్తదనం

కొత్తదనం

కథ విషయంలో నేను హండ్రెడ్ పర్సెంట్ కొత్తదనాన్ని ఫీలవుతున్నాను. ఈ మధ్యే ఈరోస్ ప్రతినిధి సునీల్ లుల్లా, డైరెక్టర్ శ్రీవాస్ కలిసి మాట్లాడుకున్నాం. కోన వెంకట్, గోపీ మోహన్ అన్ని ఎలివెంట్స్ ఉన్న మంచి కథ అందించారు. రత్నం, శ్రీధర్ సీపానలు కూడా ఈ సినిమాకు పని చేస్తున్నారని బాలయ్య తెలిపారు.


అందరికీ నచ్చేవిధంగా

అందరికీ నచ్చేవిధంగా

ఈ సినిమాకు ఒక ఫ్రెష్ టీంతో కలిసి పని చేస్తున్నాను. యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషన్స్, ఎంటర్టెన్మెంట్ అన్ని ఎలిమెంట్స్ తో యూనిక్ కాన్సెప్టుతో రూపొందనున్న ఈ సినిమా అందరికీ నచ్చే విధంగా ఉంటుందని బాలయ్య తెలిపారు.


దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ...

దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ...

బాలయ్యతో పని చేయడం ఆనందంగా ఉంది. చాలా కాలంగా ఆయనతో చేయాలనుకుంటున్నాను. ఈరోస్ సంస్థ సౌత్ లో ప్రొడ్యూస్ చేస్తున్న తొలి సినిమా ఇదే. ఆ సంస్థతో మా వేధాశ్వ క్రియేషన్స్ బ్యానర్ తో నేను కోప్రొడ్యూసర్ గా పార్ట్ కావడం మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది. చాలా హ్యాపీగా ఉంది అన్నారు.


బాలయ్య సపోర్టుతో

బాలయ్య సపోర్టుతో

బాలయ్య సపోర్టుతో నిర్మాతగా మారాను. బాలయ్య బాబును ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని విధంగా డిఫరెంటుగా ప్రజెంట్ చేస్తున్నాము.


అంజలితో పాటు మరో హీరోయిన్

అంజలితో పాటు మరో హీరోయిన్

ఈ చిత్రానికి సంగీతం థమన్, కెమెరా శ్యామ్ కె.నాయుడు అందిస్తున్నారు. ఫైట్స్ రవి వర్మ, ఆర్ట్ బ్రహ్మకడలి, గౌతం రాజు ఎడిటింగ్ చేస్తున్నారు అని తెలిపారు. ఈ సినిమాలో అంజలి హీరోయిన్ గా నటించనుంది. మరో హీరోయిన్ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని శ్రీవాస్ తెలిపారు.


నటీనటులు

నటీనటులు

నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్


టెక్నీషియన్లు

టెక్నీషియన్లు


ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.
గోపీచంద్

గోపీచంద్

బాలయ్యకు ఫ్లవర్ బొకే అందజేస్తున్న గోపీచంద్


బాలయ్య-అంజలి

బాలయ్య-అంజలి

డిక్టేటర్ మూవీ ప్రారంభోత్సవంలోబాలయ్య-అంజలి


English summary
Photos of Dictator Movie Launch event held at Hyderabad. Balakrishna and others graced the event.
Please Wait while comments are loading...