»   » బాలయ్య ‘డిక్టేటర్’ టాక్ ఎలా ఉంది?

బాలయ్య ‘డిక్టేటర్’ టాక్ ఎలా ఉంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డిక్టేటర్' చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైంది. బాక్సాఫీసు వద్ద నుండి వస్తున్న టాక్ ప్రకారం బాలయ్య మరో విజయం తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. క్రిటిక్స్ నుండి కూడా ఈ చిత్రానికి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. బాలయ్య మార్క్ ఎంటర్టెనర్ గా అభిమానులు మెప్పించే విధంగా ఉందని అంటున్నారు.

బాలయ్య పెర్ఫార్మెన్స్, పవర్ ఫుల్ డైలాగులతో అదరగొట్టాడని, సినిమా మొత్తాన్ని సింగిల్ గా తన భుజాలపై మోసాడని అంటున్నారు. దర్శకుడు శ్రీవాస్ బాలయ్యను ఈ సినిమాలో చాలా బాగా చూపెట్టాడని టాక్. సోనాల్ చౌహాన్, అంజలి పెర్ఫార్మెన్స్ పరంగా, అందం పరంగా ఆకట్టుకున్నారని అంటున్నారు. సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ బావుందని, బాలయ్య, రతి అగ్నిహోత్రి మధ్య వచ్చే పొలిటికల్ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయట.


Balakrishna's Dictator public talk

అయితే బాగానే ఉంది కానీ..... సినిమా అతి ముఖ్యమైన, ఆత్మలాంటి కథ విషయంలో మాత్రం దర్శకుడు నిరాశ పరిచాడని టాక్. స్టోరీ పాత చింతకాయ పచ్చడిలా ఉందని అంటున్నారు. ఇక బాలయ్య లాంటి పెద్ద హీరోలు ఉంటే విలన్ బలంగా ఉండాలి. కానీ ఈ విషయంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడని అంటున్నారు. కేవలం బాలయ్య లుక్, డైలాగులు, హీరోయిన్లతో డాన్సుల విషయంలో తప్ప మిగతా విషయాలను దర్శకుడు నిర్లక్ష్యం చేసాడని అంటున్నారు.


బాలయ్య అభిమానులు మాత్రమే ఇష్టపడే కమర్షియల్ స్టఫ్ మాత్రమే సినిమాలో ఉందని అంటున్నారు. బాయ్య అభిమానుల వరకు ఓకే గానీ...ఇతరులు, ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపైనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయని టాక్.

English summary
Balakrishna's Dictator public talk is good. Dictator is a film which has all the necessary ingredients of a typical commercial entertainer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu