For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అదిరింది బాసూ: బాలకృష్ణ ఫస్ట్ సెల్ఫీ(ఫొటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్: సెల్ఫీ అనేది ఈ మధ్య కాలంలో చాలా చాలా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. ఎవరికి వారు ఫోటోలు తీసుకొని, వాటిని నెట్లో అప్ లోడ్ చేసి ఆనందిస్తున్నారు. అందుకు ప్రధాని మోడీ నుంచి సినిమా తారల దాకా అందరూ చేస్తున్నారు. అయితే బాలకృష్ణ మాత్రం ఇప్పటివరకూ అలాంటిది చేయలేదు. కానీ రీసెంట్ గా ఆయనకీ ఆ సరదా పుట్టినట్లుంది. ఇదిగా ఇలా సెల్ఫీలు తీసుకున్నారు. మీరు చూస్తున్న ఫొటోలు అవే.

  ఈ ఫొటోలను ఆయన తన తాజా చిత్రం షూటింగ్ లో తీసుకున్నారు. ఆయన నుంచి ఇలాంటి ఫోజులను ఎవరూ ఎక్సపెక్ట్ చేయరు. ఈ సెల్ఫీ ల ద్వారా ఆయన ఈ చిత్రంలో ఏ గెటప్ లో ఉండబోతున్నారో అనేది బయిటకు వచ్చింది. ఇక ఆయన సరసన త్రిష సైతం ఇదిగో ఇలా చిరునవ్వులు చిందిస్తూ ఫోజిచ్చింది.

  చిత్రం విషయాలకి వస్తే..

  ధర్మం ఎప్పుడూ ఒంటరికాదు. దానిని కాపాడ్డానికి ఎవరో ఒకరు శ్రమిస్తూనే ఉంటారు. ధర్మాన్ని నిలబెట్టి, న్యాయాన్ని రక్షించి, అవినీతిపై యుద్ధం చేసిన పౌరుడి కథే మా సినిమా అంటున్నారు సత్యదేవా. ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడు. త్రిష, రాధికా ఆప్టే కథానాయికలు.

  రుద్రపాటి రమణారావు నిర్మాత. అరకులో చిత్రీకరణ జరుగుతోంది. రామ్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలో పోరాట సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. మరో వారం రోజుల పాటు అరకులోనే చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

  ''లెజెండ్‌'తో బాలకృష్ణ ఇమేజ్‌ మరింత పెరిగింది. ఈ సినిమాలో ఆయన పాత్ర అందుకు ఏమాత్రం తగ్గదు. మణిశర్మ స్వరపరిచిన గీతాలు అందరినీ అలరిస్తాయ''న్నారు. ఈ చిత్రం కోసం 'వారియర్‌', 'లయన్‌' అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

  Balakrishna's First Selfie!

  ఇక బాలకృష్ణ 99 వ చిత్రం విషయానికి వస్తే...

  నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం(99 వ) నికి రంగం సిద్దమవుతున్నాడు. ఆ చిత్రానికి దర్శకుడుని ఎంపిక అయ్యారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు లౌక్యంతో హిట్ కొట్టిన శ్రీవాసు అని తెలుస్తోంది. ఆ మధ్యన బాలకృష్ణ కోసం కోన వెంకట్, గోపీ మోహన్ ఓ కథ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే కథని డైరక్ట్ చేయబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. బాలకృష్ణతో చేస్తూండటంతో అతను పెద్ద డైరక్టర్ల లీగ్ లోకి వెళ్లినట్లే.

  రీసెంట్ గా బాలకృష్ణ తన కుటుంబంతో కలిసి లౌక్యం చిత్రాన్ని స్పెషల్ షో చూడటం జరిగింది. ఇంప్రెస్ అయిన బాలకృష్ణ ఓ వినోదాత్మకమైన చిత్రం చేయటానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే తన అభిమానులను నిరాశపరచకుండా యాక్షన్ సన్నివేశాలకు కూడా సరైన స్దానం స్క్రిప్టులు ఇవ్వమని కోరినట్లు సమాచారం. ఈ మేరకు స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ స్క్రిప్టు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

  మరో ప్రక్క అందరూ రామ్ చరణ్ తో శ్రీవాస్ ముందుకు వెళ్తారని భావించారు. అయితే ఈ లోగా బాలకృష్ణ ఈ ఆఫర్ ఇవ్వటంతో ఇటు జంప్ అయినట్లు చెప్పుకుంటున్నారు. పాండవులు పాండవులు తుమ్మెద,లౌక్యం విజయాలతో మినిమం గ్యారెంటీ దర్శకుడుగా అతను టాలీవుడ్ లో సెటిల్ అయినట్లే. బాలకృష్ణతో కూడా అదే మాదిరిగా హిట్ కొడితే అతనికి తిరుగు ఉండదని సినీ వర్గాలు అంటున్నాయి.

  ఫ్లిప్‌కార్ట్, జబోంగ్, అమెజాన్, స్నాప్‌డీల్ 80% ఆఫ్ సేల్, త్వరపడండి!

  English summary
  
 
 Nandamuri Balakrishna has taken a selfie and that too along with the leading lady of his forthcoming venture 'Lion'.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X