»   » విన్నారా....అదిరింది: ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ఆడియో సాంగ్

విన్నారా....అదిరింది: ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ఆడియో సాంగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఉగాది రోజు లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై బిబో శ్రీనివాస్ సమర్పణలో వై. రాజీవ్‌రెడ్డి, జె. సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆంధ్ర రాజధాని అమరావతిలో ప్రారంభమైంది. అప్పటినుంచీ పనలు ముమ్మరం అయ్యాయి.

ఇక అఫీషియల్ గా ఈ చిత్రం గురించి నిర్మాతలు ఏమీ రిలీజ్ చేయకపోయినా ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ అంటూ అబిమానులు ఫ్యాన్ మేడ్ ట్రైలర్ విడుదల చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రం సాంగ్ ని ప్రముఖ పాటల రచయిత సిరాశ్రీరాసి, కిల్లర్ వీరప్పన్ సంగీత దర్శకుడు చేత స్వరపరిచి వదిలారు. సినిమాకు, ఈ పాటకు సంభందం లేదని చెప్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ సైతం పెట్టారు. మీరూ ఆ పాట గురించి సిరాశ్రీరాసిన మాటలను ఇక్కడ చూడవచ్చు.



మరో ప్రక్క ఓపినింగ్ అయిన ఆ రోజు నుంచే ఈ చిత్రానికి బిజినెస్ ఆఫర్స్ , ఎంక్వైరీలు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. దాంతో క్రిష్ గత చిత్రాలకు ఎప్పుడూ జరగని విధంగా బిజినెస్ క్రేజ్ రావటం చూసి చాలా ఆనందపడుతున్నాడట..అంతేకాదు బోల్డు థ్రిల్ ఫీలవుతున్నాడని సమాచారం..


షూటింగ్ ప్రారంభం కాకుండానే ఈ స్దాయిలో ఉండటంతో ఆయన సంతోషానికి పగ్గాలు లేవంటున్నారు. తనే నిర్మాతగా కూడా వ్యవరిస్తూ మొత్తం భాధ్యతలు తీసుకోవటంతో ఈ బిజినెస్ ఆఫర్స్ మరింత సంతోషాన్ని కలిగిస్తునట్లు చెప్తున్నారు.


ఇకఈ సినిమాకు దర్శకులుగా బోయపాటి శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్, కృష్ణవంశీ లాంటి దర్శకుల పేర్లు వినిపించినా.., ఫైనల్ గా క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు బాలకృష్ణ. శాతవాహన రాజు గౌతమీ పుత్రశాతకర్ణి పాత్రలో బాలయ్య నటించనున్నాడు. చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించడానికి రెడీ అవుతున్నారు.


వారాహి చలనచిత్ర నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి క్రిష్ స్వయంగా ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధం అవుతున్నాడు. 50 కోట్ల బడ్జెట్ తో భారీగా ఈ సినిమాను రూపొందించడానికి రెడీ అవుతున్నారు. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు మొరాకోలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భారీ సెట్ లు అదే స్థాయిలో గ్రాఫిక్స్ వర్క్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు బడ్జెట్ కూడా భారీగానే అవుతుందని అంచనా వేస్తున్నారు.


Balakrishna's ‘Gautamiputra Satakarni’ Audio Song

ప్రపంచంలో చారిత్రక వాతావరణం ఉన్న ప్రదేశాల్లో మొరాకో ఒకటి. అక్కడ సహజ వాతావరణం ఉంది. పురాతనమైన కోటలు, కట్టడాలు ఉన్నాయి. రాజు కథ కాబట్టి యుద్ధ సన్నివేశాలూ ఉంటాయి. వాటిని తీయడానికి కావలసిన విశాలమైన మైదాన ప్రాంతాలు మొరాకో లో చాలా ఉన్నాయి.


ఇక క్రిష్ సైతం ఈ చిత్రం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ...దక్షిణాది నుండి వచ్చిన ఓ వ్యక్తి భారతదేశం మొత్తాన్ని ఏకం చేసిన విధానం ఎంతో ప్రాశిష్టమైనదని, అలాంటి "గౌతమిపుత్ర శాతకర్ణి" జీవితాన్ని తెరకెక్కించే అవకాశం కలగడం, దానికి బాలకృష్ణ గారు ఒప్పుకోవడం తన అదృష్టమని, ఒకవేళ బాలయ్య ఒప్పుకొని పక్షంలో ఈ కధ కార్యరూపం దాల్చేది కాదని స్పష్టం చేసారు. పక్కా కమర్షియల్ అంశాలతో కధను చెడగొట్టకుండా అయితే సినిమాను తెరకేక్కిస్తానని, ఆ నమ్మకం తనకు ఉందని, దాదాపుగా 50 కోట్ల బడ్జెట్ అవుతుందని అన్నారు.


అంతేకాదు, తన సినిమాలలో ఎప్పుడూ ఉండే సామజిక అంశాల ప్రస్తావన ఈ సినిమాలో కూడా ఉంటుందని, ఈ సినిమా విడుదల అయిన తర్వాతైనా కులాల గొడవలు పోతాయని తాను ఆశిస్తున్నట్లుగా క్రిష్ వ్యాఖ్యలు చేసారు.

English summary
Lyricist SiraSri and Music Director Rawi Shanqar have collectively produced and released an audio song as a token of respect for NBK#100 Film “Gautamiputra Satakarni’, being made in the direction of Krish.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu