»   » బాలయ్య జోరుకు బెంబేలెత్తిపోయిన గీతా మాధురి (వీడియో)

బాలయ్య జోరుకు బెంబేలెత్తిపోయిన గీతా మాధురి (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎనర్జీ అంటేనే బాలయ్య... బాలయ్య అంటేనే ఎనర్జీ. సినిమాలో ఆయన సాంగేసుకున్నా, ఫైటింగులు చేసినా, డైలాగ్ చెప్పినా, రొమాన్స్ చేసినా బాలయ్యకు బాలయ్యే సాటి అంటుంటారు ఆయన అభిమానులు. అభిమానుల మాటను మరోసారి నిజం చేసారు బాలయ్య.

ప్రియుడితో సింగర్ గీతా మాధురి వివాహం (ఫోటోలు)

ప్రస్తుతం బాలయ్య తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందుపురం నియోజకవర్గంలో జరుగుతున్న లేపాక్షి ఉత్సవాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉత్సవాలు తన ఆధ్వర్యంలో జరుగుతుండటంతో బాలయ్య చాలా కేర్ తీసుకుంటున్నారు. బాధ్యతలు చూసుకోవడంతో పాటు స్వయంగా లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు.

లవ్: సింగర్ గీతామాధురికి కారు గిఫ్టుగా...(ఫోటోస్)

లేపాక్షి ఉత్సవాల్లో భాగంగా ఆయన శ్రీకృష్ణ దేవరాయల గెటప్ లో పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు. తర్వాత జరిగిన కార్యక్రమంలో స్వయంగా పాట పాడి అలరించారు. ఓ వైపు పాటలు పాడుతూనే స్టెప్స్ వేస్తూ తనలోని ఎనర్జీని ప్రదర్శించారు. బాలయ్య ఎనర్జీ చూసి పక్కనే ఉన్న సింగిర్ గీతా మాధురి బెంబేలెత్తిపోయింది. ఆయన స్పీడును అందుకోలేక తడబడింది. అందుకు సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడొచ్చు.

బాలయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన లేపాక్షి ఉత్సవాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. బాలయ్య ఏదైనా కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తే ఏ రేంజిలో ఉంటుందో లేపాక్షి ఉత్సవాల ద్వారా నిరూపితమైంది. లేపాక్షి ఉత్సవాలు టూరిజం అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని అంటున్నారు.

English summary
The ever energetic Balayya strikes back once again. Balakrishna, who organised Lepakshi Utsavalu a few days ago in his own constituency Hindupur, not only took care of every detail of the event, but has also performed live to entertain the audience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu