»   » 50 కోట్ల క్లబ్బులో చేరిన బాలయ్య లెజెండ్!...నిజమా?

50 కోట్ల క్లబ్బులో చేరిన బాలయ్య లెజెండ్!...నిజమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి వంశంలో ఇప్పటి వరకు ఏ ఒక్క కథానాయకుడు కూడా రూ. 50 కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించుకోలేక పోయారు. ఈ రేర్ ఫీట్‌ను బాలయ్య తొలిసారిగా 'లెజెండ్' చిత్రం ద్వారా సాధించారంటూ ఆ చిత్రం యూనిట్ సభ్యుల నుండి ప్రకటన విడుదలైంది.

మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'లెజెండ్' నందమూరి అభిమానులతో పాటు యావత్ సినీ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుని ఘన విజయం సొంతం చేసుకుందని, తొలివారంలోనే 33 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిందని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ చిత్రం రూ. 50 కోట్ల కలెక్షన్లు రాబట్టడం ఖాయం అన్న సినీ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ 50 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించినట్లు తెలిపారు.

Balakrishna's 'Legend' in 50 Cr club

నందమూరి నటసింహం బాలకృష్ణ అభినయం, ఆయన పలికిన సంభాషణలు, బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ, వారాహి చలన చిత్రం మరియు 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థల నిర్మాణ విలువలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంచలన విజయంలో కీలక పాత్ర పోషించాయన్నారు.

ముఖ్యగా దర్శకుడు బోయపాటి శ్రీను తన 5వ చిత్రంతోనే 50 కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించుకోవడం విశేషం. లెజెండ్ విజయానందంలో ఉన్న నందమూరి అభిమానులకు బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశం నూతనోత్సాహాన్నిచ్చింది. ఈ రోజు బాలయ్య హిందూపుర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసారు.

కాగా....లెజెండ్ చిత్రం 50 కోట్ల క్లబ్బులో చేరలేదని, ఆ చిత్రం ఫుల్ రన్‌లో కూడా రూ. 40 కోట్లకు మంచి వసూలయ్యే పరిస్థితి లేదని కథనాలు ప్రచారంలోకి వచ్చిన వెంటనే 'లెజెండ్' చిత్రం 50 కోట్ల మార్కును అందుకుందని ప్రకటన వెలవుడటం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

English summary
'Legend' film has been running successfully with huge collections. The film has completed 33 crores in the first week itself and the trade analysts have said that the film will definitely collect 50 crores. Now, the analysis has come true.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu