»   » 812, 116....ఇదీ బాలయ్య సినిమా సరికొత్త రికార్డ్!

812, 116....ఇదీ బాలయ్య సినిమా సరికొత్త రికార్డ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ నట విశ్వరూపాన్ని మరోసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి పలు రికార్డులను తిరగరాసిన చిత్రం 'లెజెండ్‌'. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం 2014, మార్చి 27న విడుదలై సూపర్ హిట్ అయింది. తాజాగా ఈ చిత్రం ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్ లో 812 రోజులు పూర్తి చేసుకుంది. ఇక్కడ విజయవంతంగా 116 వారాలు ప్రదర్శితం అయింది.

'సింహా' వంటి సూపర్‌ సక్సెస్‌ అనంతరం మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన 'లెజెండ్‌' చిత్రం, 'సింహా' రికార్డులను తిరగ రాయడంతోపాటు.. బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. భారీ బడ్టెట్‌తో తెరకెక్కిన ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. మ్యూజిక్‌ మిస్సైల్‌ దేవిశ్రీప్రసాద్‌ బాణీలు, హీరోయిన్లు సొనల్‌ చౌహాన్‌ అందం, రాధికా ఆప్టే అభినయంతోపాటు.. ఫ్యామిలీ హీరో టర్న్‌డ్‌ విలన్‌ జగపతిబాబు ప్రతినాయకుడిగా ప్రదర్శించిన విలనిజం 'లెజెండ్‌' చిత్రానికి మెయిన్‌ హైలైట్‌గా నిలిచింది.


Balakrishna

వీటన్నిటికంటే ముఖ్యంగా...బాలకృష్ణ పాత్ర తీరుతెన్నుల్ని దర్శకుడు బోయపాటి తీర్చిదిద్దిన విధానం ధియేటర్‌లో ఆడియన్స్‌ చేత విజిల్స్‌ వేయించింది. అలాగే.. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా చిత్ర నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపి ఆచంట, అనిల్‌ సుంకర మరియు సమర్పకులు సాయి కొర్రపాటి పాటించిన నిర్మాణ విలువలు 'లెజెండ్‌' చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

English summary
Nandamuri Balakrishna created a new record as his movie 'Legend' has achieved a are feat. Legend has completed the successful run of 812 days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu