»   » బాలకృష్ణ 'లెజెండ్‌' ఆడియో ఎప్పుడంటే...

బాలకృష్ణ 'లెజెండ్‌' ఆడియో ఎప్పుడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Legend
హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న నూతన చిత్రం 'లెజెండ్‌'. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోని పిభ్రవరి రెండో వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించారు. ఈ విషయాన్ని నిర్మాతలు ఖరారు చేసారు.

'సింహ' కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. జగపతిబాబు ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. రాధికా ఆప్టే, సొనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. దేవీశ్రీప్రసాద్‌ తొలిసారి బాలకృష్ణ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. నూతన సంవత్సర కానుకగా చిత్ర యూనిట్‌ లెజెండ్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.

అలాగే నందమూరి బాలకృష్ణ సినిమాలు అంటే సింహాచలంలో చిత్రీకరణ పక్కాగా ఉంటుందనేది ఆయన సినిమాలు చూస్తే ఎవరైనా చెప్పేస్తారు. అంతటి అనుబంధముంది ఆయన సినిమాలకు ఆ ప్రాంతానికి. ఇప్పుడు 'లెజెండ్‌' చిత్రీకరణ కూడా ఇటీవల ఇదే ప్రాంతంలో జరిపారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని హైదరాబాద్‌లో ఓ సెట్‌గా రూపొందించారు. అక్కడ చిత్ర ప్రధాన తారగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ.... ''బాలకృష్ణను శక్తివంతమైన నాయకుడిగా చూపించబోతున్నాం. సామాజిక అంశాలపై ఆయన సంధించే ప్రశ్నలు సమాజంలో చైతన్యం కలిగించేలా ఉంటాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వస్తోంది. సినిమా కూడా ఇదే స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది''అని చెబుతున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చుతున్నారు.

English summary
The audio album of Balakrishna’s ‘Legend’ will be released in the month of February. Devi Sri Prasad has composed the tunes for this movie and this is his first music album for Balakrishna. . The film will come to theaters on the 28th of March. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu