»   » బాలయ్య లుక్ అదిరింది... (లయన్ న్యూ ఫోటోస్)

బాలయ్య లుక్ అదిరింది... (లయన్ న్యూ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ త్వరలో ‘లయన్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవలే గ్రాండ్ గా విడుదలైంది. సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బాలయ్య నటించిన గత చిత్రం ‘లెజెండ్' భారీ హిట్టయిన నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది పబ్లిసిటీ జోరు పెంచారు. సినిమాకు సంబంధించిన సరికొత్త స్టిల్స్ విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.


రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యంలో జివ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సత్య దేవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తొలిసారిగా బాలయ్యతో త్రిష జతకడుతుండగా...‘లెజెండ్' అనంతరం రాధిక ఆప్టే మరోమారు బాలకృష్ణ సరసన నటిస్తోంది.


ఆడియో గ్రాండ్‌గా

ఆడియో గ్రాండ్‌గా

ఇటీవల శిల్పకళా వేదికలో జరిగిన ‘లయన్' ఆడియో వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభిమానుల సమక్షంలో పంక్షన్ గ్రాండ్ గా జరిగింది.


నిర్మాత

నిర్మాత

నిర్మాత రమణారావు మాట్లాడుతూ...ఈ చిత్రంలో బాలయ్య గారి పాత్రను దర్శకుడు సత్యదేవ మలిచిన తీరు, ఆయన చేత పలికించిన సంబాషణలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. బాలకృష్ణ-మణిశర్మ కాంబినేషన్ లో వస్తున్న మరో మ్యూజికల్ సెన్నేషన్ హిట్ ఈ సినిమా' అన్నారు.


అంచనాలు భారీగా

అంచనాలు భారీగా

‘లెజెండ్' వంటి లెజెండరీ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో నందమూరి అభిమానుల్లో ‘లయన్' చిత్రంపై భారీ అంచనాలుండటం సహజమే. వారి అంచనాలను మించే స్థాయిలో ‘లయన్' చిత్రం ఉండబోతోంది అన్నారు.


సెంటిమెంట్

సెంటిమెంట్

బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్‌గా పేర్కొనే..సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు చిత్రాల ఆడియోలకు నారా చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో విచ్చేసి ఆడియో రిలీజ్ చేసారు. ఇపుడు లయన్ ఆడియో కూడా ఆయన చేతుల మీదుగా జరిగింది. సెంటిమెంట్ పరంగా చూసుకుంటే ‘లయన్' చిత్రం బాలయ్య కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నారు నిర్మాత.


ఇద్దరు భామలు

ఇద్దరు భామలు

తొలిసారిగా బాలయ్యతో త్రిష జతకడుతుండగా...‘లెజెండ్' అనంతరం రాధిక ఆప్టే మరోమారు బాలకృష్ణ సరసన నటిస్తోంది.


English summary
Lion is a 2015 Telugu film produced by Rudrapati Ramana Rao under SLV cinema banner, directed by Satyadev. The film stars Nandamuri Balakrishna, Trisha Krishnan, Radhika Apte in the lead roles. Music is handled by Mani Sharma. The movie is first debut to director Satyadev.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu