»   » ఇద్దరి హీరోయిన్స్ తో బాలయ్య ఉగాది విషెష్ (పోస్టర్)

ఇద్దరి హీరోయిన్స్ తో బాలయ్య ఉగాది విషెష్ (పోస్టర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలకృష్ణ తాజా చిత్రం ‘లయన్'. ఈ చిత్రం కొత్తపోస్టర్ ని ఉగాది సందర్భంగా నిర్మాతలు విడుదల చేసారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన చేస్తున్న ఇద్దరు హీరోయిన్స్ త్రిష,రాధికా ఆర్టేల ని ఈ పోస్టర్ లో ఉండేలా డిజైన్ చేసారు. ఈ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. యంగ్ లుక్ తో బాలకృష్ణ తన అభిమానులను అలరించటం గమనించవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అలాగే ఆడియోని ఏప్రిల్ 9న రిలీజ్ చెయ్యడానికి నిర్ణయించారు. ఏప్రిల్ 9న శిల్పకళ వేదికలో గ్రాండ్ గా జరగనున్న ఈ ఆడియో లాంచ్ కి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నాడు.


ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ప్యాచ్ వర్క్ సీన్స్ ని ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రధాన తారాగణంపై ఓ ఫ్యామిలీ సాంగ్ షూట్ ని ఫినిష్ చెయ్యడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. అలాగే ‘లయన్' సినిమా ఆ
అలాగే ఈ సినిమాని ఏప్రిల్ చివర్లో రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది.


‘లయన్' శాటిలైట్ హక్కులు విడుదలకు ముందే అమ్ముడయ్యాయి. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమినీ 6 కోట్లకు ‘లయన్' శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.


Balakrishna's “Lion” new Poster released

త్రిష మరియు రాధిక ఆప్టే హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా, సామాన్యుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సత్యదేవ దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. యాక్షన్ ఎంటర్టైనర్ గా అభిమానులను అలరించే అన్ని అంశాలతో సినిమాను రూపొందిస్తున్నారు.


నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు. కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి.


అటు రాజకీయంగా, ఇటు సినిమాపరంగా వరుస విజయాలు సాధిస్తూ ఊపుమీదున్న బాలకృష్ణ ఎంతో ఉత్సాహంతో ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బాలకృష్ణ గతంలో నటించిన ‘సీతారామకల్యాణం', ‘బొబ్బిలిసింహం', ‘తల్లిదండ్రులు' చిత్రాల తరహాలో మంచి హిట్ కొట్టబోతున్నామని నిర్మాత చెప్తున్నారు. బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు

English summary
Here comes the first ever poster of Nandamuri Balakrishna’s “LION” that features two of his heroines. With Ugadi festival falling on Saturday.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu