»   » ధియోటర్ లో పైరసీ చేస్తుంటే పట్టుకున్న ‘లయన్‌’ టీమ్‌

ధియోటర్ లో పైరసీ చేస్తుంటే పట్టుకున్న ‘లయన్‌’ టీమ్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పైరసీ సినిమాకు పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా పెద్ద సినిమాలు ఈ పైరసీ తో చాలా నష్టపోతున్నారు. దాంతో వేరే వారిపై ఆధారపడకుండా తమ చిత్రాలు పైరసీ బారిన పడకుండా తామే రంగంలోకి దిగి రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మొన్న గురువారం బాలకృష్ణ హీరోగా ఎస్‌.ఎల్‌.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మించిన ‘లయన్‌' చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని పైరసీ చేయడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

బెంగుళూరులోని ఓ థియేటర్‌లో ఈ సినిమాని కెమెరాతో చిత్రీకరించడానికి ఓ వ్యక్తి ప్రయత్నించగా, సకాలంలో అక్కడికి చేరుకున్న ‘లయన్‌' టీమ్‌ ఆ ప్రయత్నాలకు అడ్డు పడ్డారు. అలాగే రైల్వే కోడూరులో రవి అనే వ్యక్తి తన ఇంట్లోనే ‘లయన్‌' పైరసీ సీడీ తయారు చేస్తున్నాడనే సమాచారంతో ‘లయన్‌' టీమ్‌ అక్కడికి వెళ్లగా, అతను తప్పించుకుని పారిపోయాడు. ‘లయన్‌' సినిమాను పైరసీ చేసే ప్రయత్నాలు సాగనివ్వమనీ, ఇప్పటికే కొంతమంది వ్యక్తులపై నిఘా పెట్టామని ‘లయన్‌' టీమ్‌ చెప్పింది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Balakrishna's Lion Piracy DVDs

తాజాగా ఒంగోలులోని సీడీ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లయన్ సినిమా పైరసీ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీడీ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. లయన్ పైరసీ వెనక....సౌతిండియా పైరసీ మాఫియా హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఈ పైరసీ సీడీలు ఇప్పటికే పంపిణీ అయినట్లు సమాచారం. అదే నిజమైతే పైరసీ కారణంగా నిర్మాతలు నష్టపోవడం ఖాయం.


సినిమా విషయానికొస్తే....‘లయన్' చిత్రం ఓపెనింగ్స్ భారీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 5.5 కోట్ల మేర వసూలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం ద్వారా సత్య దేవ దర్శకుడిగా పరిచయం అయ్యారు. రుద్రపాటి రామరావు నిర్మాత. బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు

English summary
Lion team raided and caught important camcoder name Vasanth from Bangalore with his camera. Also they raided in Railway Kodur for a person named Ravi. He was absconded and missing from from his home.
Please Wait while comments are loading...