»   » కొత్త ముహూర్తం: ‘లయన్’ రిలీజ్ మళ్లీ వాయిదా

కొత్త ముహూర్తం: ‘లయన్’ రిలీజ్ మళ్లీ వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘లయన్'. ఈ చిత్రం మే 1 విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలో మే 8కి వాయిదా వేసారు. తాజాగా ఈ డేట్ మే 14కు పొడగించారు. అంటే ఈ వారం కాకుండా వచ్చే వారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

జె.రామాంజనేయులు సమర్పణలో రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సార్థ్యంలో ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై సత్యదేవ దర్శకత్వంలో రుద్రపాటి రామణారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తొలిసారిగా బాలయ్యతో త్రిష జతకడుతుండగా....‘లెజెండ్' అనంతరం రాధిక ఆప్టే మరోమారు బాలయ్య సరసన నటిస్తోంది.


Balakrishna's Lion Release Pushed To Another Date

ఇటీవల విడుదలైన టీజర్, థియేట్రికల్ ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బాలయ్య గెటప్, డైలాగ్స్ కి అభిమానులు, ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘యూ/ఎ' సర్టిఫికెట్ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వర్డ్ వైడ్ గా మే 14, గురువారం ఉదయం 9.36 గంటలకు విడుదల కానుంది.


ఈ సందర్భంగా రుద్రపాటి రామణారావు మాట్లాడుతూ....బాలయ్యగారి నటవిశ్వరూపాన్ని మరోసారి చాటి చెప్పే చిత్రమవుతుంది. బాలయ్య ఇమేజ్ కి తగిన విధంగా సినిమాను సత్యదేవ తెరకెక్కించారు. మణిశర్మగారు ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్యారు. సినిమాలోని డైలాగులు ప్రేక్షకులు ఎప్పుడు థియేటర్లలో చూద్దామా అని ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 14న విడుదల చేస్తున్నాం అన్నారు.

English summary
Nandamuri Balakrishna's Lion has been facing release hiccups time and again. Earlier it was reported that the film will release on May 1 and then the release got pushed to May 14 because of the supposed technical delay.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu