»   » పైసా వసూల్ రిలీజ్ అనుకొన్న డేట్‌కు కష్టమే.. మరో సినిమాపై బాలయ్య దృష్టి

పైసా వసూల్ రిలీజ్ అనుకొన్న డేట్‌కు కష్టమే.. మరో సినిమాపై బాలయ్య దృష్టి

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటసింహం నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పైసా వసూల్ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ముగ్గురు అందాల భామలు శ్రీయా సరన్, ముస్కిన్, చార్మీ కౌర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా వేగంగా సినిమాలు పూర్తి చేస్తారనే పేరున్న పూరీ జగన్నాథ్ ఈ సినిమాను ముందుగా అనుకొన్న డేట్‌ను మార్పు చేసే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తున్నది.

రిలీజ్ డేట్‌లో మార్పు

రిలీజ్ డేట్‌లో మార్పు

ఇటీవల ఓవర్సీస్‌లో లాంగ్ షెడ్యూల్‌కు సంబంధించిన పూటింగ్‌ను పూర్తి చేసుకొని వచ్చిన యూనిట్ హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ రిలీజ్ డేట్ విషయంలో కొంత మార్పు చేసినట్టు తెలియవచ్చింది.


Introducing Ballari Balayya,No.1 Balakrishna Fan
బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూళ్లలో బాలయ్య

బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూళ్లలో బాలయ్య

షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నిర్మాత ఆనంద ప్రసాద్ ఉత్సాహంగా ఉన్నారు. బాలకృష్ణ కూడా చాలా ఉత్సాహంగా బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూళ్లలో పాల్గొంటూ పూరీకి సహకరిస్తున్నారనేది ఇన్‌సైడ్ టాక్. పైసా వసూల్ చిత్రంలో బాలయ్యబాబు కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని బాలయ్యను పైసా వసూల్ చిత్రంలో చూస్తారని దర్శకుడు పూరీ జగన్నాథ్ తన సన్నిహతులతో చెప్పినట్టు తెలుస్తున్నది.


అప్పుడే మరో సినిమాపై బాలయ్య దృష్ణి

అప్పుడే మరో సినిమాపై బాలయ్య దృష్ణి

పైసా వసూల్ సినిమాను వీలైనంత తర్వాత పూర్తి చేసి తదుపరి చిత్రాన్ని ప్రారంభించడానికి బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ జూలై 22 నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉందనే మాట ఫిలింనగర్‌లో వినిపిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ ముందే పూర్తి కావడం పట్ల చిత్ర యూనిట్, నిర్మాత చాలా ఆనందంగా ఉన్నట్టు తెలుస్తున్నది.


ఫ్యాన్స్‌కు ముందే రానున్న దసరా

ఫ్యాన్స్‌కు ముందే రానున్న దసరా

వాస్తవానికి పైసా వసూల్ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 29న రిలీజ్ చేయాలని భావించారు. కానీ సినిమా షూటింగ్ అనుకున్న ప్లాన్ కంటే ముందే పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సినిమాను అనుకొన్న రిలీజ్ డేట్ కంటే ముందుగానే విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాత వీ ఆనంద ప్రసాద్ ఉన్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ ఇదే నిజమైతే నందమూరి అభిమానులకు దసరా పండుగ ముందే రావడం ఖాయం.


ఆసక్తిగా నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూపులు

ఆసక్తిగా నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూపులు

పోర్చుగల్‌లో షూటింగ్ సందర్భంగా తన జన్నదినాన్ని పురస్కరించుకొని పైసా వసూల్ సినిమా ఫస్ట్‌లుక్‌ను బాలయ్య రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పైసా వసూల్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ట్రైలర్, ఆడియో ఫంక్షన్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.English summary
Nandamuri Balakrishna has been busy shooting for his next movie titled Paisa Vasool. The film stars Shriya Saran, Muskeen and Charmee Kaur in the lead roles. Reports suggest that majority shoot of the film is going to be completed by July 22nd. The makers planned to release this movie on September 29th during Dasara season. But they now planning to prepone the film's release.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu