»   »  ఈ వీడియో చూస్తే నోరు వెళ్ల బెట్టేస్తారు... హ్యాట్సాఫ్ బాలయ్యా

ఈ వీడియో చూస్తే నోరు వెళ్ల బెట్టేస్తారు... హ్యాట్సాఫ్ బాలయ్యా

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి నట సింహం బాలయ్య తండ్రికి తగ్గనటుడిగా పేరు తెచ్చుకున్నారు. లెంజడరీ యాక్టర్‌గా టాలీవుడ్‌ను ఏలిన నందమూరి తారకరామారావు పౌరాణిక పాత్రలకు జీవం పోశారు. తెరమీద ఆయన కనిపించే రూపమే దేవుడి నిజస్వరూపం అనుకునేవాళ్లంటే... పాత్రకు తగ్గట్టు వేషం వేసుకోవడంలో గానీ, డైలాగులు చెప్పడంలో గానీ ఆయన ఎంత శ్రద్ధకనబరిచారో అర్థమవుతుంది. ఎంత పెద్ద డైలాగైనా ఆయన చెప్పే విధానంలో రాజసం ఉట్టిపడుతుంది. ఆ విషయంలో ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఈ తరం హీరోలు అలాంటి డైలాగులు చెప్పడానికి సాహసించరు. అయితే చిన్నప్పటి నుంచి తండ్రితో పాటు పౌరాణిక సినిమాల్లో నటించడం వల్ల అలాంటి డైలాగులు చెప్పడంలో బాలయ్య ప్రత్యేక శ్రద్ధ కనుబరుస్తారు. ముఖ్యంగా తన తండ్రి సినిమాల్లోని డైలాగులన్నింటినీ బాలయ్య అలవోకగా చెప్పేస్తారు. అందుకు నిదర్శనం ఈ వీడియోనే.

Balakrishna Says Dialogue For His Fans In Flight

బాలయ్య ఓ సారి విమానంలో వెళ్తున్నారు. అదే విమానంలో ఓ ప్రయాణికుడు తన ట్యాబ్లెట్‌లో మాయాబజార్ సినిమా చూస్తున్నాడు. విమానంలో బాలయ్య ఉన్న విషయం గమనించిన ఆ ప్రయాణికుడు ఆయన పక్కసీటుకు వెళ్లి కూర్చున్నాడు. తనకు క్లాసికల్ మూవీస్ అంటే చాలా ఇష్టమని, ఎన్టీఆర్‌కు వీరాభిమాని అని చెప్పాటడ ఆ ప్రయాణికుడు. అంతేకాకుండా 'దాన వీర శూర కర్ణ' సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన భారీ డైలాగ్ ఒకటి చెప్పాలని బాలయ్యను రిక్వెస్ట్ చేశాడట.

అభిమాని అంతలా అడుగుతుండడంతో బాలయ్య కూడా కాదనలేకపోయారట. చేతిలో ట్యాబ్లెట్ పట్టుకుని డైలాగ్ మొత్తం చెప్పేశారు. ఈ సన్నివేశం మొత్తాన్ని ఆ అభిమాని వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ లా పాకింది. ఇక బాలకృష్ణ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో గౌతమి పుత్ర శాతకర్ణి అనే చిత్రాన్ని చేస్తోండగా ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

English summary
Balakrishna Says Dialogue For His Fans In Flight & Entertained Everyone
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu