»   »  కృష్ణగాడి వీర ప్రేమగాధను చూసిన బాలయ్య: భళారే అంటూ అభినందన

కృష్ణగాడి వీర ప్రేమగాధను చూసిన బాలయ్య: భళారే అంటూ అభినందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రయూనిట్‌ను నటసింహ నందమూరి బాలకృష్ణ అభినందించారు.ప్రసాద్ ల్యాబ్స్ లో నాని, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్ర స్పెషల్ షో ను ఆయన వీక్షించారు.

హనురాఘపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం ఫిభ్రవరి 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజై మంచి సక్సెస్ ను సాధించింది. స్పెషల్ షోను వీక్షించిన అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడారు.

Balakrishna sees Krishna gaadi Veera Prema Gadha

‘నాని యాక్టింగ్ చాలా బాగా చేశాడు. సినిమాలో ఎంటర్ టైన్మెంట్ చాలా బావుంది. రాయలసీమలోని లోకేషన్స్ ను సినిమాటోగ్రాఫర్ యువరాజ్ అద్భుతంగా తెరకెక్కించారు. దర్శకుడు హను రాఘవపూడి సినిమాను ఎంటర్ టైనింగ్ గా, థ్రిల్లింగ్ గా తెరకెక్కించారు' ఆయన అన్నారు.

‘నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించిన విధానం ప్రశంసనీయం. నేను నటించిన లెజెండ్ సినిమాను సందర్భానుసారం ఉపయోగించిన విధానం చాలా బావుంది. నా ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పృథ్వీ, బ్రహ్మాజీ, సత్యం రాజేష్ పాత్రల కామెడిని బాగా ఎంజాయ్ చేశాను. ఈ క్యారెక్టర్స్ సహా ప్రతి ఒకరూ చాలా చక్కగా నటించారు. అన్నీ వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే చిత్రమిది' బాలయ్య అన్నారు.

Balakrishna sees Krishna gaadi Veera Prema Gadha

లేపాక్షి ఉత్సవాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, అమూల్యమైన సమయాన్ని కేటాయించి స్పెషల్ షోను వీక్షించి చిత్రయూనిట్ ను అభినందించిన నందమూరి బాలకృష్ణకు 14రీల్స్ నిర్మాతలు ప్రత్యేక కృతజ్ఞ‌త‌లు తెలియజేశారు.

English summary
Nandamuri Balakrishna has seen Nani's Krishangaadi Veera Prema Gadha at Prasad labs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu