»   » భేషజం లేని "స్టార్": రోడ్డుపక్కనే నేలమీద బాలయ్య నిద్ర

భేషజం లేని "స్టార్": రోడ్డుపక్కనే నేలమీద బాలయ్య నిద్ర

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌లో షూటింగప్పుడు కూడా బాలకృష్ణ మేకప్‌ చేసుకోవడానికి తప్ప, క్యారవాన్ పెద్దగా వాడరు. బాలకృష్ణ నలభయ్యేళ్ల ప్రయాణం . ఒక స్టార్ కథానాయకుడిగా గొప్ప విజయాలెన్నో సొంతం చేసుకొన్నారు. కానీ ఆ గర్వం మాత్రం తలకెక్కించుకోలేదు. ఇప్పటికీ ఆయన జనం మధ్య షూటింగ్ చేయడానికే ఇష్టపడుతుంటాడు.

పోర్చుగల్

పోర్చుగల్

సెట్లోనూ అందరితో కలివిడిగా మెలుగుతూ. చాలామందిలా షాట్‌కీ, షాట్‌కీ మధ్య గ్యాప్‌లో దానిలోకి దూరిపోవడమూ ఉండదు. బయట ఎండలోనే యూనిట్‌ అందరితో పాటు ఉంటూ,. కష్టపడే తత్త్వం, సీను బాగా రావడం కోసం దేనికైనా తెగించే మనస్తత్వం, పరిస్థితులను బట్టి సర్దుకుపోవడమే తప్ప, నిర్మాత నెత్తి మీద గొంతెమ్మ కోరికల బండబరువు పెట్టని బాలకృష్ణ మంచితనం తాజాగా పోర్చుగల్ లో కూడా మరోసారి ఋజువైంది.

బాల‌య్య లుక్

బాల‌య్య లుక్

సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల‌ కానున్న బాల‌య్య 101వ చిత్ర టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ ని బ‌ర్త్ డే సంద‌ర్భంగా నిన్న సాయంత్రం విడుద‌ల చేశారు. ఇందులో బాల‌య్య లుక్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుంది. ఇప్పుడు అభిమానులంద‌రు ఈ పోస్ట‌ర్స్ ని చూసి తెగ మురిసిపోతున్నారు.

బాల‌య్య 101వ మూవీ

బాల‌య్య 101వ మూవీ

క‌ట్ చేస్తే పోర్చుగ‌ల్ లో రోడ్డు ప‌క్క‌న ఉన్న ప‌చ్చిక బ‌య‌లులో ప్రశాంతంగా ప‌డుకున్న బాల‌య్య ఫోటో ఒక‌టి నెట్ లో హ‌ల్ చేస్తుంది. సింప్లిసిటీ కి కేరాఫ్ అడ్రెస్ బాల‌య్య అంటూ ఆయ‌న అభిమానులు ఈ ఫోటోని సోష‌ల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. బాల‌య్య 101వ మూవీ పైసా వ‌సూల్ అనే టైటిల్ తో తెర‌కెక్కుతుండ‌గా, ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద త‌ప్ప‌క పైసా వ‌సూల్ గా ఉంటుంద‌ని ఫ్యాన్స్ త‌మ ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

పైసా వసూల్‌

పైసా వసూల్‌

పోర్చుగల్‌లో షూటింగ్‌లో... అంతే ప్రశాంతంగా పచ్చిక బయలులో పడుకొని, హీరో అనే ఆభిజాత్యం లేకుండా పని చేసిన బాలకృష్ణను చూసి చిత్ర యూనిట్‌ ఆశ్చర్యపోయి, కథలు కథలుగా ఇప్పుడు అందరికీ చెబుతున్నారు... అక్కడ నెలరోజులుగా బాలకృష్ణ నూటొకటో సినిమా ‘పైసా వసూల్‌' నిర్మిస్తున్న భవ్య క్రియేషన్స్‌అధినేత వి. ఆనందప్రసాద్‌.

English summary
Balayya is taking a nap next to the road on the sets. This clears shows his down to earth attitude.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu