»   » జూ ఎన్టీఆర్ పెళ్ళి లో మెయిన్ అట్రాక్షన్ గా మోక్షజ్ఞ, కళ్యాణ్ రామ్...

జూ ఎన్టీఆర్ పెళ్ళి లో మెయిన్ అట్రాక్షన్ గా మోక్షజ్ఞ, కళ్యాణ్ రామ్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల కాలంలో ఏ వివాహ వేడుక జరగనంత అంగరంగ వైభవంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహం జరిగింది. కాగా ఈ పెళ్ళి వేడుకలో అన్నీ తానై కళ్యాణ్ రామ్ ముందుండి నడిపించడం పలువురిని ఆకర్షించింది. కళ్యాణ్ రామ్ హుందాగా ప్రవర్తించడం చూసి చాలా మంది అతనికి మార్కులు వేస్తున్నారు. ఒక తల్లి బిడ్డలు కాకపోయినా ఎన్టీఆర్ ని తన సొంత తమ్ముడిలా భావించి కళ్యాణ్ రామ్ ఆప్యాయంగా మెలగడం అతని సంస్కారానికి నిదర్శనమని కూడా పలువురు ఈ వేడుకల్లో మాట్లాడుకోవడం వినిపించింది.

కాగా ఎన్టీఆర్ పెళ్లికెళ్లిన, టీవీల్లో చూసిన నందమూరి అభిమానులందరికీ పెళ్లి సంబరంతో పాటు మరో సంతోషం కూడా దక్కింది. నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరో లక్షణాలతో తయారవుతూ ఉండడం వారిని అమితంగా ఆకట్టుకుంది. ఎర్లీ టీన్స్ లో ఉన్న మోక్షజ్ఞ అప్పుడే అయిదడుగుల పదంగుళాల హైటున్నాడు. అంటే అరడుగుల హైట్ ఎదగడం ఖాయమన్నామాట. ఇక రూపంలోను మోక్షజ్ఞ అందగాడేనని చూస్తేనే తెలిసిపోతుంది. మరో అయిదారేళ్ల తర్వాత అతడిని హీరోగా పరిచయం చేయాలనుకుంటూ ఉంటే కనుక అప్పటకి మోక్షజ్ఞ రియల్ హీరోలా తయారవుతాడు. ఇక సరయిన కథలు ఎంచుకుంటే కనుక అతనికి ఆకాశమే హద్దు.

English summary
Balakrishna, Mokshagna and Rajamouli at Junior Ntr Wedding Reception. Biggest marriage of AP, Ntr Jr wedding with Laxmi Pranathi lived up to all the hype and expectations, if not exceeded them. The sets, the lights, the crackers, the food, the number of guests… everything rocked and proved why this was the big fat wedding of AP.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu