twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలగోపాలుడు నుంచి కళ్యాణ్ రామ్‌ని చూస్తున్నా.. ఇంతింతై వటుడింతై.. బాలకృష్ణ!

    |

    నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన చిత్రం 118. సస్పెన్స్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంటూ సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ తొలిసారి దర్శత్వం వహిస్తున్న చిత్రం ఇది. మార్చి 1న 118 విడుదల కానున్న నేపథ్యంలో సోమవారం రోజు వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు బాలకృష్ణ, ఎన్టీఆర్ అతిథులుగా హాజరయ్యారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ ప్రసంగిస్తూ 118 చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశాడు.

     ఇంతింతై వటుడింతై అన్నట్లుగా

    ఇంతింతై వటుడింతై అన్నట్లుగా

    బాలయ్య మాట్లాడుతూ.. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ లో 118 చిత్రానికి నిర్మించిన మహేష్ కోనేరు, చిత్ర దర్శకుడు కెవి గుహన్ లకు బాలయ్య ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. 118 చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. కళ్యాణ్ రామ్ గురించి మాట్లాడుతూ.. కళ్యాణ్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదుగుతున్నాడని బాలయ్య అన్నారు.

     బాలగోపాలుడు చిత్రంలో

    బాలగోపాలుడు చిత్రంలో

    కళ్యాణ్ రామ్ తాను నటించిన బాలగోపాలుడు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయాన్ని బాలయ్య ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ మనమధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం అని బాలయ్య అన్నారు. కోడిరామకృష్ణ తనతో బాలగోపాలుడు, మువ్వగోపాలుడు, ముద్దుల కృష్ణయ్య లాంటి అద్భుత చిత్రాలు తెరకెక్కించారని బాలకృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

    ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్

    ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్

    కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి అతనొక్కడే చిత్రంతో హీరోగా మారిన కళ్యాణ్ రామ్ ప్రయాణం గురించి బాలయ్య తెలిపారు. 118 చిత్ర ట్రైలర్ అద్భుతంగా ఉందని బాలకృష్ణ కితాబిచ్చారు. గుహన్ తెలుగులో దర్శత్వం వహిస్తున్న మొట్టమొట్టి చిత్రం 118 అని బాలయ్య అన్నారు. ఈ చిత్రం అఖండ విజయం సాధించాలని బాలయ్య అన్నారు.

    తారక్ పేరు చెప్పగానే

    బాలయ్య కళ్యాణ్ రామ్, తారక్ పేరు చెప్పగానే అభిమానుల్లో కేరింతలు మొదలయ్యాయి. సినిమా రంగంలో మన కుటుంబం ఇలాగే రాణించాలని బాలయ్య ఆకాంక్షించారు. 118 లో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలయ్య తన ప్రసంగాన్ని ముగించారు. బాలయ్య ప్రసంగిస్తున్న సమయంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆయన పక్కనే నిలబడ్డారు.

    English summary
    Balakrishna speech at Kalyan Ram's 118 movie pre release event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X