»   » డ్రగ్స్ కేసు సమయంలో బాలయ్య సపోర్టుగా ఉన్నారు: పూరి

డ్రగ్స్ కేసు సమయంలో బాలయ్య సపోర్టుగా ఉన్నారు: పూరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో తనను విచారించినప్పుడు నటుడు బాలకృష్ణ తనకు చాలా సపోర్ట్‌ చేశారని దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలిపారు. 'పైసా వసూల్' సినిమా ప్రమోషన్ సందర్భంగా పూరి మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.

డ్రగ్స్ విచారణ సమయంలో నా కుటుంబం చాలా కృంగి పోయింది. ఆయ సమయంలో మాకు అండగా నిలిచిన ఒకేఒక్క నటుడు బాలయ్య అని, ఆయన తనకు, తన కుటుంబానికి ధైర్యం ఇచ్చిన సందర్భాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని పూరి అన్నారు.

బాలయ్య ఎనర్జీ సూపర్

బాలయ్య ఎనర్జీ సూపర్

‘పైసా వసూల్' సినిమాకు బాలయ్యతో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. బాలయ్య తెల్లవారు జామున 4 గంటలకే ఆయన నిద్రలేచి, షూటింగ్ స్పాట్ కు వచ్చేవారు. ఇప్పటి యంగ్ హీరోల కంటే పది రెట్లు ఎనర్జీ బాలయ్యలో ఉందని పూరి తెలిపారు.

బాలయ్య అంకిత భావం

బాలయ్య అంకిత భావం

బాల‌కృష్ణ‌గారికి సినిమా అంటే ఇష్టం. ఆయన చేసే ప్రతి సినిమా నా సినిమా అనుకుని చేస్తారు. ‘పైసా వసూల్' షూటింగ్ సమయంలో లైట్‌ పోతుంది అని చెప్పి బాలయ్యే స్వయంగా అందరినీ పిలిచి గబగబా కెమెరా పక్కకి వెళ్లి నిలుచున్న సందర్భాలు అనేకం. ఇలాంటి హీరో ఇండస్ట్రీలో బాలయ్య ఒక్కరే అని పూరి అన్నారు.

బాలయ్యను మిస్సవుతున్నాను

బాలయ్యను మిస్సవుతున్నాను

బాలయ్యతో ఇన్నాళ్లు చేయక మిస్‌ అయ్యా. ఇప్పుడు షూటింగ్‌ పూర్తయ్యాక రోజూ మిస్‌ అవుతున్నా. ఇలాంటి హీరోని నేను ఇప్పటిదాకా చూడలేదు. క్రమశిక్షణ, అంకితభావం ఉన్న నటుడు ఆయన..... అని పూరి అన్నారు.

పైసా వసూల్

పైసా వసూల్

సెప్టెంబర్‌ 29న విడుదల చేయాలనుకుంటే ఐదు వారాల ముందు తనకు కావాలని నిర్మాతగారు అడిగారు. బాలయ్యతో పాటు అందరూ సపోర్టు చేయడం వల్లే ఇది సాధ్యమైందని పూరి తెలిపారు.

English summary
"When I was faced with the Drugs case Inquiry, Balayya has supported me and my family" Puri Jagannadh said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu