»   » బాలకృష్ణ కేరీర్లో కేక పెట్టించేలా...(ఫోటో ఫీచర్)

బాలకృష్ణ కేరీర్లో కేక పెట్టించేలా...(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలకృష్ణ పుట్టినరోజంటే ఆయన అభిమానులకు పండగే. బాలయ్య 55వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులు జూన్ 10న ఆయన పుట్టినరోజు వేడుకలు గనంగా జరిపారు. నటుడిగా నాలుగు దశాబ్ధాల ప్రయాణాన్ని పూర్తి చేసుకొన్నారు బాలకృష్ణ. ఇప్పుడు ఆయన వందో సినిమాకి చేరువలో ఉన్నారు.

బాలకృష్ణ ప్రస్తుతం సత్యదేవా దర్శకత్వంలో తన 98వ సినిమా చేస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్. బాలయ్య 100వ సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఉంటుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. శ్రీకృష్ణ దేవరాయల సబ్జెక్టుతో ఈ చిత్రం ఉండే అవకాశం ఉంది. బాలయ్య కెరీర్లోనే హైలెట్ అయ్యేలా ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట.

తెలుగు సినిమా పరిశ్రమలోని అగ్రహీరోల్లో బాలయ్య ఒకరు. ఆయన కెరీర్లో ఇప్పటి వరకు వచ్చిన హిట్ చిత్రాలపై ఓ లుక్కేద్దాం...

మంగమ్మ గారి మనవడు

మంగమ్మ గారి మనవడు

బ్యానర్ : భార్గవ్ ఆర్ట్స్
డైరక్టర్ : కోడి రామకృష్ణ
నిర్మాత : ఎస్.గోపాల్ రెడ్డి
విడుదల సంవత్సరం: 1984
‘మంగమ్మగారి మనవడు'. సినిమా శ్లాబ్‌లో కొట్టుమిట్టాడుతున్న రోజుల్లో విడుదలైన ఆ సినిమా సంచలనాలకు కేంద్రబిందువు అయ్యింది. 500 రోజులు ప్రదర్శితమై ఎన్టీఆర్ వారసుడి సత్తా ఏంటో తెలియజేసింది.

అనసూయమ్మగారి అల్లుడు

అనసూయమ్మగారి అల్లుడు

బ్యానర్ : రామకృష్ణ స్టూడియోస్
డైరక్టర్ : కోదండ రామిరెడ్డి
నిర్మాత : నందమూరి జయకృష్ణ
విడుదల సంవత్సరం: 1986
హోమ్ ప్రొడక్షన్ లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. పొగరుమోతు అత్త తో అల్లుడు సవాల్ తో నడిచే ఈ చిత్రం ఇప్పటికీ బాలయ్య అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. బాలయ్యలోని స్టామినా ఏంటో భాక్సాఫీస్ వద్ద తేల్చి చెప్పిన చిత్రం ఇది.

సీతారామ కళ్యాణం

సీతారామ కళ్యాణం

బ్యానర్ : యువ చిత్ర
డైరక్టర్ : జంథ్యాల
నిర్మాత : కె.మురారి
విడుదల సంవత్సరం: 1987
1986-87లో బాలకృష్ణ వరసగా భాక్సాఫీస్ వద్ద 5 హిట్స్ ఇచ్చి రికార్డ్ క్రియేట్ చేసారు. దేశోధ్దారకుడు, అనసూయమ్మగారి అల్లుడు, కలియుగ కృష్ణుడు, సీతారామ కళ్యాణం, అపూర్వ సహోదరులు. ఇక సీతారామ కళ్యాణం చిత్రం..ఫ్యాన్స్ కు అతీతంగా అందరూ చూసి ఆనందించారు రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ అందించారు. రాళ్ళల్లో ఇసుకల్లో పాట ఇప్పటికీ మారు మ్రోగుతూనే ఉంటుంది.

ముద్దుల మావయ్య

ముద్దుల మావయ్య

బ్యానర్ : భార్గవ ఆర్ట్స్
డైరక్టర్ : కోడి రామకృష్ణ
నిర్మాత : ఎస్.గోపాల్ రెడ్డి
విడుదల సంవత్సరం: 1989
తమిళ రీమేక్ గా వచ్చి సూపర్ హిట్టైన చిత్రం ముద్దుల మామయ్య. ఎన్టీఆర్ రక్త సంభందం లాంటి అన్న -చెల్లెళ్ళ సెంటిమెంట్ ని బలంగా చూపిన ఈ చిత్రం బాలయ్యకు ఫెరఫెక్ట్ ఫిల్మ్ గా రికార్డులు క్రియేట్ చేసి నిలిచిపోయింది.

ఆదిత్య 369

ఆదిత్య 369

బ్యానర్ : శ్రీదేవి ఆర్ట్ మూవీస్
డైరక్టర్ : సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత : అనిత ప్రసాద్
విడుదల సంవత్సరం: 1991
మాస్ హీరోకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన బాలయ్య...ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఒప్పుకోవటం అందరికీ ఆశ్చర్యం. ముఖ్యంగా ఈ చిత్రంలో శ్రీకృష్ణ దేవరాయులు గెటప్ ఎవరూ మర్చిపోలేరు. జానవులే.., రాసలీల వేళ పాటలు అప్పట్లో మెగా హిట్.

రౌడీ ఇన్స్ స్పెక్టర్

రౌడీ ఇన్స్ స్పెక్టర్

బ్యానర్ : విజయలక్ష్ణి ఆర్ట్ మూవీస్
డైరక్టర్ : బి . గోపాల్
నిర్మాత : టి. త్రివిక్రమరావు
విడుదల సంవత్సరం: 1992
ఎన్టీఆర్ తో జస్టిస్ చౌదరి వంటి హిట్ ఇచ్చిన బ్యానర్ లో బాలయ్య చేసిన సినిమా ఇది. అంతకు ముందు లారీ డ్రైవర్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన బి.గోపాల్ తో చేసిన ఈ చిత్రం సంచలన విజయం సాథించింది. ఎక్కడ విన్నా ఈ పాటలే వినపడేవి. విజయశాంతి కూడా ఈ సినిమాలో అదరకొట్టింది.

భైరవ ద్వీపం

భైరవ ద్వీపం

బ్యానర్ : చందమామ విజయ కంబైన్స్
డైరక్టర్ : సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత : బి.విశ్వనాథ రెడ్డి
విడుదల సంవత్సరం: 1994
మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ వంటి ఎన్నో ఆణిముత్యాలు అందించిన "విజయ" బ్యానర్ అంటే తెలియదు. వారు చాలా గ్యాప్ తర్వాత అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత చేసిన చిత్రం ఇది. జానపద చిత్రం గా వచ్చిన ఈ చిత్రం బాలయ్య ఎలాంటిపాత్ర కైనా ప్రాణం పోస్తాడని ప్రూవ్ చేసింది.

సమర సింహా రెడ్డి

సమర సింహా రెడ్డి

బ్యానర్ : శ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్
డైరక్టర్ : బి.గోపాల్
నిర్మాత : చంగల వెంకట్రావు
విడుదల సంవత్సరం: 1999
బాలకృష్ణ పని అయిపోయింది...అనుకున్న టైమ్ లో మిస్సైల్ లా దూసుకు రావటానికి దోహదం చేసిన చిత్రం ఇది. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి తెలుగు సినిమా ప్రేరణ పొందుతోందంటే ఈ చిత్రం గొప్పతనం ఏమిటో ఆర్దం చేసుకోవచ్చు. రాయలసీమ ఫ్యాక్షన్స్ మీద ఓ రివేంజ్ స్టోరీని అల్లి బాలయ్య నటనతో ఘన విజయం సాధించారు.

నరసింహ నాయుడు

నరసింహ నాయుడు

బ్యానర్ : వెంకట రమణ ప్రొడక్షన్స్
డైరక్టర్ : బి.గోపాల్
నిర్మాత : మేడికొండ మురళి కృష్ణ
విడుదల సంవత్సరం: 2001 భాక్సాఫీస్ కు సెన్సేషనల్ హిట్ అనేది తెలియచేసిన చిత్రం ఇది. ఫ్యామిలీ సెంటిమెంట్ కు కుటుంబాల పగ ను కలిసి అల్లిన ఈ కథ బాలకృష్ణ కెరీర్ లో విపరీతమైన ఊపు తెచ్చింది. చాలా కాలం తర్వాత 275 ఆడిన సినిమా ఇది.

సింహా

సింహా

బ్యానర్ : యునైటెడ్ మూవీస్
డైరక్టర్ : బోయపాటి శ్రీను
నిర్మాత : పరుచూరి కిరీటి
విడుదల సంవత్సరం: 2010
బాలకృష్ణకు వరస ఫ్లాపులు..బాలయ్యతో సినిమా అంటే కష్టం అంటూ అంతా చేతులు ఎత్తేస్తున్నారు. అయితే సరైన సినిమా పడితే బాలకృష్ణ ఎప్పుడూ భాక్సాఫీస్ సింహమే...అని ప్రూవ్ చేసిన చిత్రం ఇది.

లెజెండ్

లెజెండ్

బ్యానర్: 14 రీల్స్ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం
డైరెక్టర్ : బోయపాటి శ్రీను
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర
విడుదల తేదీ 2014
ఇటీవల విడుదలైన లెజెండ్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాలయ్య ఎమ్మెల్యేగా గెలవడానికి బాగా తోడ్పడిందనే వాదనకూడా ఉంది.

English summary
Nandamuri Balakrishna is an Indian film actor and politician, who works predominantly in Telugu cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu