ఎన్టీఆర్ బయోపిక్‌కు బ్రేక్.. బాలయ్య అసహనం.. తేజకు తలనొప్పులు.. ఇందిరాగా ఆమేనట..
Recommended Video

నందమూరి బాలకృష్ణ భుజానికి ఇటీవల సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర షూటింగ్‌లో బాలయ్య గాయాల బారిన పడ్డారు. ఇటీవల భుజం నొప్పి తిరగదోడటంతో ఫిబ్రవరి 3వ తేదీన సర్జరీ అవసరమైంది. ఈ నేపథ్యంలో తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

బాలకృష్ణకు సర్జరీ
వాస్తవానికి బాలకృష్ణకు సర్జరీ ముందుగా ప్లాన్ చేయలేదు. నొప్పి భరించే స్థితిలో ఆయన లేకపోవడంతో టర్న రొటేటర్ కఫ్‌కు సర్జరీ చేయాల్సి వచ్చింది. ప్రముఖ వైద్యులు దీప్తి నందన్‌రెడ్డి, ఆశీష్ బాబుల్కర్ పర్యవేక్షణలో శనివారం సాయంత్రం సర్జరీ జరిగింది అని బాలకృష్ణ సన్నిహితులు పేర్కొన్నారు.

భుజానికి నొప్పి తీవ్రతరం
వాస్తవానికి బాలకృష్ణకు ముందే ఈ సర్జరీ జరుగాల్సింది. అయితే శాతకర్ణి తర్వాత వరుసగా పైసా వసూల్, జై సింహా చిత్రాలు చేయాల్సి రావడంతో సర్జరీ పలుమార్లు వాయిదా పడింది. జై సింహా తర్వాత నొప్పి పెరుగడంతో ఆపరేషన్ అనివార్యమైంది.

ఆరువారాల విశ్రాంతి
భుజానికి సర్జరీ తర్వాత బాలకృష్ణకు ఆరువారాలపాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంది. దాంతో ఎన్టీఆర్ బయోపిక్ మరో ఆరువారాలపాటు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. త్వరలోనే బయోపిక్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

తేజకు కొత్త తలనొప్పి
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ బయోపిక్‌లో పాత్రల ఎంపిక దర్శకుడు తేజకు తలనొప్పిగా మారిందట. అంతేకాకుండా ఈ చిత్రంలోని పాత్రల తీరుతెన్నులపై ఓ హాలీవుడ్ బృందం పనిచేస్తున్నదట. ఈ బృందం దాదాపు 72 మంది పాత్రధారులకు సంబంధించిన రూపురేఖలను అందజేశారట.

ఇందిరగా నదియా
ఇక ఎన్టీఆర్ బయోపిక్‌లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రకు విజయశాంతి, నదియా పేర్లను పరిశీలించారట. చివరకు నదియా వైపే తేజ మొగ్గు చూపినట్టు తెలుస్తున్నది.

బాలకృష్ణ అసహనం
ఎన్టీఆర్ బయోపిక్ పనుల ఆలస్యంపై బాలకృష్ణ అసంతృప్తితో ఉన్నారట. ఈ మధ్యలోనే సర్జరీ కావడం మరింత అసహనంతో బాలయ్య ఉన్నట్టు సమాచారం. త్వరలోనే మళ్లీ షూటింగ్ ప్రారంభించి అదే రోజు ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేయాలని బాలయ్య భావిస్తున్నాడట.


Click it and Unblock the Notifications











