»   » పైసావసూల్ థియేటర్లో బాలకృష్ణ: అభిమానుల సందడి

పైసావసూల్ థియేటర్లో బాలకృష్ణ: అభిమానుల సందడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూరి జగన్నాథ్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పైసా వసూల్' సినిమా భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విదేశాల్లో షోలు పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉదయం నుంచే ప్రీమియర్ షోలు నడుస్తున్నాయి.

అయితే 'పైసా వసూల్'పై బాలయ్య అభిమానులు, ప్రేక్షకులు ట్వీట్లు చేస్తున్నారు. ఇది పూరీ జగన్నాథ్ మార్క్ సినిమా అని ఒకరు, బాలయ్య వన్ మ్యాన్ షో అని ఒకరు ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరి ట్వీట్‌లో కామన్‌గా కనిపిస్తున్న విషయం సినిమాలోని డైలాగులు. బాలయ్యకు పూరీ రాసిని ప్రతి డైలాగు పేలిందని, సినిమాకు డైలాగులే బలమని అంటున్నారు.


రా ఏజెంట్‌గా బాల‌కృష్ణ‌ను దర్శ‌కుడు ఎలివేట్ చేసిన తీరు, బాల‌కృష్ణ వ్యావ‌హారిక శైలి చాలా వ‌ర‌కు పోకిరి చిత్రాన్ని, పూరి గ‌త చిత్రాల‌ను గుర్తుచేస్తాయి. కెమెరాప‌రంగా, ఎడిటింగ్ ప‌రంగా సినిమా బాగా ఉంది. కానీ మావా ఏక్ పెగ్ లా, ప‌ద మ‌రి, పైసా వ‌సూల్ పాట‌లు బావున్నాయి అన్న టాక్ తో మొత్తానికి ఒక హిట్ వచ్చే చాన్స్ ఉండచ్చనీ అంటున్నారు.


Balakrishna Watched Paisa Vasool At Bramaramba Theater

నగరంలోని కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్‌లో సినీ హీరో నందమూరి బాలకృష్ట సందడి చేశారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన పైసా వసూల్‌ చిత్రం ఈ రోజు విడుదలైంది. చిత్రయూనిట్‌తో కలిసి బాలయ్య ప్రేక్షకుల మధ్యలో కూర్చొని సినిమా చూసారు. తమ హీరో వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్‌ వద్దకు చేరుకున్నారు.


English summary
Nandamuri Balakrishna and Director Puri Jagannadh Watch 'Paisa Vasool' At Bramaramba Theater,Hyderabad
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu