»   » బాలకృష్ణకు మద్దతుగా భారీ ర్యాలీ

బాలకృష్ణకు మద్దతుగా భారీ ర్యాలీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ తాజా చిత్రం డిక్టేటర్‌ ఆడియో పంక్షన్‌ ఈనెల 20న అమరావతిలోని ద్యానబుద్ధ ప్రొజెక్టు సమీపంలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని అభిమానులు విజయవంతం చేయాలని కోరుతూ ఈనెల 18 అమరావతిలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బాలకృష్ణ అభిమాన సంఘ నాయకులు తెలిపారు.

సుమారు రెండు వందల ద్విచక్రవాహనాలతో అమరావతి, ధరణికోట గ్రామాలలో జరిగే ర్యాలీలో బాలకృష్ణ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొంటారని తెలిపారు.


Balayya fans are going to organise a huge bike rally

బాలయ్య తన 99వ సినిమా డిక్టేటర్ ను.. ఖచ్చితంగా సంక్రాంతి బరిలో నిలపాలని ఫిక్స్ అయ్యారు. అందుకే బాలకృష్ణ రెస్ట్ లేకుండా ఈ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇటీవల ఢిల్లీలో ఈ సినిమాకు సంబంధించిన మెయిన్ పార్ట్‌ని పూర్తి కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో క్లైమాక్స్‌కు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్‌తో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని సమాచారం.


ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్‌కు చేరుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న క్లైమాక్స్ ఫైట్ తర్వాత మరో రెండు పాటలని షూట్ చేయనుండగా అందులో ఒకటి శ్రద్దాదాస్‌తో ఉండనున్నట్టు తెలుస్తోంది.


Balayya fans are going to organise a huge bike rally

అంజలి, సోనాల్ చౌహన్,అక్ష హీరోయిన్లుగా తెరకెక్కుతోంది. సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌, కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.

English summary
Balayya fans are going to organise a huge bike rally from Sattenpalli highway to the villages of Amravati and Dharanikota.
Please Wait while comments are loading...