»   » బాలకృష్ణ కుమార్తె వివాహం- హైలెట్స్ (ఫోటోలు)

బాలకృష్ణ కుమార్తె వివాహం- హైలెట్స్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : మహానటుడు ఎన్టీ రామారావు మనవరాలు, హీరో బాలకృష్ణ, వసుంధరాదేవి దంపతుల చిన్న కుమార్తె తేజస్విని వివాహం మతుకుమల్లి శ్రీపట్టాభి రామారావు, శ్రీమణి దంపతుల కుమారుడు శ్రీభరత్‌తో జరిగింది. మంగళవారం ఉదయం 8.52 గంటలకు తేజస్విని మెడలో శ్రీభరత్ మూడు ముళ్లూ వేశాడు.

  హైదరాబాద్, మాదాపూర్‌లోని హైటెక్స్‌లో అంగరంగ వైభోగంగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇటు సినీ, అటు రాజకీయ రంగాలకు చెందిన అనేకమంది హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బాలకృష్ణ అభిమానులూ ఇతోధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకకు మరింత కళ తీసుకువచ్చారు.

  సినిమా సెట్స్‌ను తలపించేరీతిలో సంప్రదాయబద్ధంగా వేసిన భారీ సెట్‌లో కన్నుల పండువగా జరిగిన ఈ వివాహానికి రాజకీయ, సినీ, వ్యాపార, పారిశ్రామికరంగ ప్రముఖులతో పాటు వేలాది సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, బాలకృష్ణ బావ నారా చంద్రబాబునాయుడు, రాజ్యసభ సభ్యుడు కురియన్‌, కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జైపాల్‌రెడ్డి, చిరంజీవి, పురందేశ్వరి, సర్వే సత్యనారాయణ, తమిళనాడు గవర్నర్‌ కె.రోశయ్య, పత్రికాధిపతులు రామోజీరావు, కిరణ్‌ (ఈనాడు), ముత్తా గౌతమ్‌ (ఆంధ్రప్రభ), తెలుగుదేశం పార్టీ యువనేత ముత్తా శశిధర్‌, ఇంకా రాధాకృష్ణ (ఆంధ్రజ్యోతి), పార్లమెంట్‌ సభ్యులు నామా నాగేశ్వరరావు, మాగుంట శ్రీనివాసులరెడ్డి, కనుమూరి బాపిరాజు, రాయపాటి సాంబశివరావు, టి.సుబ్బరామిరెడ్డి, సుజనాచౌదరి, శాసనసభ్యురాలు జయసుధ, తెలుగుదేశం పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, ఎర్రబెల్లి దయాకరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కరణం బలరాం, రేవంత్‌రెడ్డి, బిజెపీ నేత బండారు దత్తాత్రేయ వచ్చారు.

  సినీ ప్రముఖులు సూపర్‌స్టార్‌ కృష్ణ, విజయనిర్మల, కృష్ణంరాజు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ, అంబికా కృష్ణ, వెంకటేష్‌, మోహన్‌బాబు, జగపతిబాబు, మురళీమోహన్‌, రోజా, సి.కల్యాణ్‌, శ్రీకాంత్‌, బోయపాటి శ్రీను, నందమూరి కల్యాణ్‌రామ్‌, మంచు లక్ష్మి, విష్ణు, మనోజ్‌, నారా రోహిత్‌, తరుణ్‌, శివాజీరాజా, ఉదయ్‌కిరణ్‌ తదితరులు హాజరయ్యారు.

  పెళ్లి హైలెట్స్ స్లైడ్ షోలో...

  జీలకర్ర - బెల్లం

  జీలకర్ర - బెల్లం

  పూర్తి స్దాయి సంప్రదాయబద్దంగా జరిగిన ఈ వివాహ వేదికలో పెళ్లి కుమారుడు,కుమార్తె...హిందు సంప్రదాయం ప్రకారం జీలకర్ర,బెల్లం తలపై ఒకరినొకరు పెట్టుకున్నప్పుడు...ముహూర్తం సమయానికి ఈ తంతు జరిపిస్తూంటారు.

  చిరు ముచ్చట...

  చిరు ముచ్చట...

  బాలకృష్ణకు మిత్రుడైన చిరంజీవి ఇలా పెళ్లి కుమారుడుని పలకరించి ఆశ్వీరదించారు. బాలకృష్ణ చిన్న అల్లుడు బాగున్నాడని ప్రశంసించారు.

  ఉంగరం తొడగటం...

  ఉంగరం తొడగటం...

  పెళ్లి కుమార్తె వేలుకి పెళ్లి కుమారుడు ఉంగరం తొడగటం అనేది ఆచారం. దాన్ని ఈ వివాహంలో ముచ్చటగా పురోహీతులు పెళ్లి పెద్దలు,బంధుమిత్రుల సమక్షంలో జరిపించారు.

  వెలిగిపోయింది

  వెలిగిపోయింది

  ఈ పెళ్లిలో పెళ్లికూరుతు తేజస్విని యువరాణిలా వెలిగిపోయింది. అందరూ ఈ జంటను ముచ్చటైన జంట అని అన్నారు. పెళ్లి పీటలపై ఆమె కాంతులీనుతూ అందరి దృష్టిని ఆకర్షించింది.

  ముచ్చట్లు

  ముచ్చట్లు

  జీవితాంతం కలిసి ఉండాల్సిన ఈ జంట ఏకమైన ఆ శుభ సమయాన ఇద్దరి ముఖాల్లో ఆనందం వెల్లి విరిసింది. ఇద్దరూ ఈ వివాహానికి ఎంతో ఇష్టపడి చేసుకుంటున్నారనేది స్పష్టమైంది. ఇద్దరు పెళ్లి పీటలపై ముచ్చట్లు ఆడుకున్నారు.

  తాళి కట్టు శుభవేళ...

  తాళి కట్టు శుభవేళ...

  తాళి కట్టడం అనేది..హిందు వివాహ సంప్రదాయంలో అతి ముఖ్యమైన అంశం. ఇద్దరూ జీవితాంతం అన్ని విషయాల్లో తోడుగా ఉంటామని ప్రమాణం చేయించి ఈ తాళి కట్టడం ద్వారా జంటను ఏకం చేస్తారు. ఆ శుభ గడియ ఈ వేదికపై...

   ఆశ్వీరిదిస్తూ...

  ఆశ్వీరిదిస్తూ...

  పెళ్లి కుమారుడు కాళ్లకు నమస్కారం చేస్తూ వధువు ..ఆశ్వీరదిస్తున్న వరుడు. ఆమెకు తోడుగా ఉంటానని, వేద మంత్రాల సాక్షిగా చేసే ప్రమాణంలో చేసి తర్వాత ఆమెకు అన్ని సౌబాగ్యాలు కలగాలని దీవిస్తాడు.

  అక్షింతలు వేస్తూ...

  అక్షింతలు వేస్తూ...

  తనతో జీవితకాలం ఉండబోయే సహచరి చల్లగా నూరేళ్లపాటు ఉండాలని వేద మంత్రాల సాక్షిగా ఆశ్వీరదిస్తూ పెళ్లి కుమారుడు. తల వంచుకుని ఆ ఆనంద క్షణాలు అనుభవిస్తున్న పెళ్లి కుమార్తె.

  పెద్దల దీవెనలు...

  పెద్దల దీవెనలు...

  వివాహ ఘట్టంలో మరో ముఖ్యాంసం పెద్దల దీవెనలు పొంగటం. నిర్ణయించిన శుభ గడియల్లో ఒకటైన ఈ జంట కలకాలం పిల్లా పాపలతో చల్లగా ఉండాలని పెళ్లి కి వచ్చిన పెద్దలు, తల్లి తండ్రులు దీవించటం మన సంప్రదాయం.

   తాళిని అందిస్తూ...

  తాళిని అందిస్తూ...

  పురోహితుడు...పెళ్లికి వచ్చిన వారి మంగళసూత్రాలకు అంటించిన మంగళ సూత్రాన్ని పెళ్లి కుమారుడుకి ఇచ్చి ..కట్టమనటం సంప్రదాయం. దాన్నే ఈ వి వాహంలోనూ తుచ తప్పకుండా పాటించారు.

  దీవించటానికి సిద్దం...

  దీవించటానికి సిద్దం...

  శుభ గడియల్లో...కొత్త జంట ఒకటవుతున్న వేళ...వివాహానికి వచ్చిన పెద్దలంతా మనస్పూర్తిగా అక్షింతలతో దీవిస్తారు. అందుకోసమే వారిని పెళ్లికి పిలుస్తారు. అలాగే ఈ పెళ్లికి వచ్చిన వారు కూడా తమ దీవెనెలు ఈ జంటకు అందచేసారు.

  పెళ్లంటే ముచ్చట్లు...ఆలింగనాలు ...

  పెళ్లంటే ముచ్చట్లు...ఆలింగనాలు ...

  తమ బంధువులను,సన్నిహితులను, స్నేహితులను, శ్రేయాభిలాషనులను ఒకే వేదికపై కలిసి ఇలా ఆలింగాలతో ముంచెత్తుతారు. అదే విధమైన సంఘటనలు ఈ పెళ్లిలో ఎక్కడ చూసినా కనపడ్డాయి.

  గౌరవం...

  గౌరవం...

  పెళ్లికి పిలవటం గొప్ప విషయం కాదు. వచ్చిన వారిని గౌరవంగా ఆహ్వానించి..వారిని సత్కరించి, వారి నుంచి కొత్త జంటకు దీవెనలు ఇప్పించటమే కీలకం. ఈ వివాహంలో బాలకృష్ణ..ఆయన బంధువర్గం ఆ పనిని సమర్ధవంతగా నిర్వహించారు.

  జయప్రకాష్ నారాయణ...

  జయప్రకాష్ నారాయణ...

  ఒకటి సినీ కుటుంబం,మరొకటి రాజకీయ కుటుంబం...దాంతో ఇరు వైపులా లబ్ద ప్రతిష్టులైన వారు ఈ పెళ్లిలో కొలువు తీరారు. పార్టీలకు అతీతంగా మాటలు కలుపుకున్నారు. రకరకాల విషయాలు ముచ్చటించుకున్నారు. అందులో ఇది ఒకటి.

  English summary
  Nandamuri Balakrishna’s daughter Tejaswini got married in great style and grandeur at HITEX, Hyderabad. The lavish wedding was attended my many popular personalities that included Tollywood stars and politicians.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more