»   » పవన్ కు పోటీ? : పెర్ఫెక్షన్ కోసం ట్రైనింగ్ అదే బాలయ్య ప్రత్యేకత

పవన్ కు పోటీ? : పెర్ఫెక్షన్ కోసం ట్రైనింగ్ అదే బాలయ్య ప్రత్యేకత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ గుర్రం ఎక్కి సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ వచ్చే నెల మొదటివారంలో ధియోటర్లో దిగుతున్నాడు. మరో ప్రక్క బాలయ్య కూడా గుర్రం ఎక్కి స్వారీ చేస్తూ ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆయన ప్రత్యేకమైన కసరత్తులు చేస్తున్నారు.

గుర్రపు స్వారీ చేయడం బాలకృష్ణకి కొత్తేమీ కాదు. సినిమాకి అవసరమైన ప్రతిసారీ ఆయన గుర్రమెక్కారు. అయితే ఈ సారి మరి ఎందుకు ప్రత్యేకంగా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాడు అంటే ..సినిమాలో ఎక్కువ భాగం గుర్రం తిరిగే సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో పెర్ఫెక్షన్ కోసం గుర్రపు స్వారీ నిపుణుల పర్యవేణలో నేర్చుకుంటున్నట్లు సమాచారం.

అయితే ఈ సారి గుర్రం ఎక్కాల్సిన అవసరం బాలయ్యకు ఏ సినిమాకు వచ్చిందీ అంటే ..ఆయన ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందించబోతున్న వందో చిత్రంకు అని తెలుస్తోంది. వందో చిత్రం చారిత్రకం కావటంతో ఆయన గుర్రపు స్వారీ మస్ట్ అండ్ షుడ్ గా చేయాల్సిన అవసరం ఏర్పడింది.

బాలయ్య ట్రైనింగ్..మరిన్ని విశేషాలు

గతంలో ..

గతంలో ..

‘భైరవద్వీపం'లో అయితే ఎక్కువగా గుర్రంపైనే కనిపిస్తారు. కానీ ఇదివరకటి సంగతి వేరు, ఇప్పుడు సంగతి వేరు.

ఈ కొత్త సినిమా కోసం..

ఈ కొత్త సినిమా కోసం..

ఈసారి స్వారీ చేయడమే కాదు, గుర్రంపై నుంచి యుద్ధం కూడా చేయాల్సి వుంటుందట.

అందుకే ...

అందుకే ...

యుద్దం చేయాలి అంటే...పూర్తి స్దాయిలో స్వారీ వచ్చి ఉండాలి. అందుకే ప్రత్యేకంగా తర్ఫీదు తీసుకుంటున్నట్టు తెలిసింది.

 త్వరలోనే

త్వరలోనే

అతి త్వరలోనే బాలకృష్ణ వందో చిత్రం మొదలుకాబోతోంది. క్రిష్‌ దర్శకత్వంలో ఆ చిత్రం తెరకెక్కబోతోంది.

అమరావతి

అమరావతి

అమరావతిని పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణ జీవితం ఆధారంగా రూపొందనుందీ చిత్రం.

టైటిల్

టైటిల్

ఆ సినిమాకి ‘యోధుడు' అనే పేరు ప్రచారంలో ఉంది.

భారీగా

భారీగా


ఇందులో బాలకృష్ణ గుర్రపుస్వారీ చేయాల్సి వుంటుందట. యుద్ధ సన్నివేశాలు కూడా భారీగా ఉంటాయట.

నిపుణులు పర్యవేక్షణ

నిపుణులు పర్యవేక్షణ

అందుకే ప్రత్యేకంగా నిపుణుల సమక్షంలో బాలయ్య తర్ఫీదు తీసుకుంటున్నట్టు తెలిసింది.

ప్రీ ప్రొడక్షన్

ప్రీ ప్రొడక్షన్


ప్రస్తుతం సినిమాకి సంబంధించిన పూర్వ నిర్మాణానంతర పనులు జరుగుతున్నట్టు సమాచారం.

పవన్ కు పోటీ? : ఫెరఫెక్షన్ కోసం ట్రైనింగ్ అదే బాలయ్య ప్రత్యేకత

పవన్ కు పోటీ? : ఫెరఫెక్షన్ కోసం ట్రైనింగ్ అదే బాలయ్య ప్రత్యేకత

అతి త్వరలోనే త్వరలోనే ఆ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

గ్లాడియోటర్ తరహాలో

గ్లాడియోటర్ తరహాలో

ఈ సినిమా పూర్తిగా హాలీవుడ్ హిట్ గ్లాడియేటర్ తరహాలో విజువల్స్ ఉంటాయంటున్నారు.

గ్రాఫిక్స్

గ్రాఫిక్స్

ఈ సినిమాలో చాలా సన్నివేశాలకు గ్రాఫిక్స్ అవసరం ఉంది. అందుకోసం కూడా సాంకేతిక నిపుణలతో చర్చలు జరుపుతున్నారు.

English summary
Balakrishna is seriously practicing horse riding for his king's role in 'Yodhudu'. Balakrishna and Krish's combo film is yet to be announced officially.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu