»   » బాలకృష్ణ ముందు ఓవర్ యాక్షన్ చేస్తే...(వీడియో)

బాలకృష్ణ ముందు ఓవర్ యాక్షన్ చేస్తే...(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ "నా ముందు యాక్షన్‌ చేస్తే ఎంజాయ్ చేస్తా... ఓవర్‌ యాక్షన్‌ చేస్తేఇంజూర్ చేస్తా", అంటూ బాలకృష్ణ 'లయన్‌' గా వచ్చేస్తున్నాడు. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. రుద్రపాటి రమణారావు నిర్మాత. జివ్వాజి రామాంజనేయులు సమర్పిస్తున్నారు. వచ్చే నెల 8న 10 గంటల 4 నిమిషాలకు చిత్రాన్ని విడుదల చేయాలని ముహూర్తం నిర్ణయించారు. ఈ సందర్భంగా చిత్రం సెకండ్ ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ ఇప్పుడు నందమూరి అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. మీరూ ఆ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


దర్శకుడు మాట్లాడుతూ ''సినిమా గురించి బాలకృష్ణ అభిమానులు ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చిత్రాన్ని తెరకెక్కించాం. బాలకృష్ణ ఇందులో కనిపించే విధానం కొత్తగా ఉంటుంది'' అన్నారు. ఎవరితోనైనా నిక్కచ్చిగా వ్యవహరించే ఆ సీబీఐ అధికారి కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు సత్యదేవా.


నిర్మాత మాట్లాడుతూ ''సినిమాని వచ్చే నెల 1న విడుదల చేద్దామనుకొన్నాం. డి.టి.ఎస్‌ మధుసూదన్‌రెడ్డిగారు హఠాన్మరణం చెందడంతో పనులు ఆలస్యమయ్యాయి. వచ్చే నెల 8న పక్కాగా విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. మణిశర్మ సమకూర్చిన సంగీతం చిత్రంపై అంచనాలను మరింత పెంచింది. అందరినీ అలరించేలా ఉంటుందీ చిత్రం'' అన్నారు.


Balayya's Lion Second Trailer

అలీ మాట్లాడుతూ ''సత్యదేవాపై నమ్మకంతో ఈ చిత్రాన్ని చేసే అవకాశం ఇచ్చారు బాలకృష్ణ. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొనేలా చిత్రాన్ని తీశాడు సత్యదేవా. ఇందులో బాలకృష్ణ చేసిన ఒక ఫైట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. రామ్‌లక్ష్మణ్‌ 11 రోజులపాటు ఎంతో కష్టపడి ఆ ఫైట్‌ని తీశారు. బాలకృష్ణ ఆ ఫైట్‌ చేసిన విధానం చాలా బాగుంటుంది. ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూసేలా ఆ సన్నివేశాలుంటాయి'' అన్నారు.


రామ్‌లక్ష్మణ్‌ మాట్లాడుతూ ''ఒక్క ఫైట్‌ మాత్రమే కాదు.. ఇందులో ఛేజింగ్‌ సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయి. మేం ఏం చెప్పినా బాలకృష్ణగారు ఎంతో ఉత్సాహంగా చేశారు. రంపచోడవరం అడవుల్లో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి'' అన్నారు.


బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు

English summary
In the recently released trailer of “Lion”, Balakrishna has once again showcased his powerful dialogue delivery style.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu