»   » ‘బలుపు’ పబ్లిక్ టాక్...రవితేజ గట్టెక్కినట్లేనా?

‘బలుపు’ పబ్లిక్ టాక్...రవితేజ గట్టెక్కినట్లేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : వరుస ప్లాపులతో సతమతమైన మాస్ మహరాజా రవితేజ, తన భవిష్యత్ గురించి ఇక తాడో పేడో తేల్చుకోవడానికా అన్నట్లు బాగా 'బలుపు'తో కసిగా ఈ రోజు బాక్సాఫీసు బరిలో దూకాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం కావడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, ప్రచార చిత్రాల్లో రవితేజ పెర్ఫార్మెన్స్ మాంచి మాస్ మసాలా దట్టించి ఉండటం, మరో హీరోయిన్ శృతి హాసన్ హాట్ అండ్ సెక్సీ గ్లామరస్ రోల్ అని ప్రచారం జరుగడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

తాజాగా విడుదలైంది. సినిమా చూసిన వారి అభిప్రాయాలను పరిశీలిస్తే......రవితేజ గత సినిమాలతో పోలిస్తే 'బలుపు' చిత్రం సంతృప్తి కరంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. కథ కొత్తదనం లేకపోయినా, సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నా...కామెడీసీన్లు, స్క్రీన్ ప్లేతో కవర్ చేసాడనే టాక్ వినిపిస్తోంది.

పరిస్థితి చూస్తుంటే రవితేజ కెరీర్‌ను 'బలుపు' మూవీ మళ్లీ గాడిలో పెట్టినట్లే కనిపిస్తోంది. అయితే తొలి రోజు గడిస్తే గానీ అన్నివర్గాల ప్రేక్షకుల అభిప్రాయాలు వెల్లడయ్యే అవకాశం లేదు. మరి ఇది నిజంగానే రవితేకు బలుపా? లేక వాపా? అనేది రేపటిలోగా తేలనుంది.

ఈ చిత్రంలో రవితేజ పేరు బలుపు శంకర్‌. పాత్ర తీరుకి తగ్గట్టుగా ఈ పేరును పెట్టారు. ప్రేమికురాలికి ఇచ్చిన మాట కోసం హీరో ఏం చేశాడు? వాటి వల్ల ఎదురైన పరిణామాలు ఏమిటన్నది కథలో కీలకాంశం. పక్కా మాస్‌ మసాలా చిత్రమిదని, ప్రేక్షకులు రవితేజ నుంచి వినోదాన్ని... అదే స్థాయి యాక్షన్‌ అంశాలూ ఆశిస్తారు. వాటికి తగ్గ విధంగా బలుపు చిత్రాన్ని తీర్చిదిదమని మేకర్స్ చెప్తున్నారు.

English summary

 The film Balupu starring Ravi Teja, Shruti Hassan and Anjali in leads, is directed by Gopichnad Malineni and produced by Prasad V Potluri. Any film starring Ravi Teja has the reputation of being a guaranteed entertainer. The movie get good public talk.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu