»   » ఓవర్సీస్‌లో ‘బలుపు’ చూపుతున్న బ్లూస్కై

ఓవర్సీస్‌లో ‘బలుపు’ చూపుతున్న బ్లూస్కై

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : రవితేజ కథానాయకుడిగా పి.వి.పి పతాకంపై నిర్మిస్తున్న 'బలుపు' చిత్రం ఈ నెల 28న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రాన్ని ఓవర్సీస్‌లో బ్లూ స్కై సంస్థ విడుదల చేయబోతోంది. 27న భారీ సంఖ్యలో ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈచిత్రం ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. వరుస ప్లాపులతో ఉన్న రవితేజ ఈచిత్రంతో నిలదొక్కుకుంటాడనే నమ్మకం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

తమ సంస్థకు ఓ మంచి హిట్‌గా ఈ చిత్రం నిలుస్తుందని నమ్మకం ఉందని, శృతిహాసన్, అంజలి గ్లామర్, నటన ఈ చిత్రానికి హైలెట్స్‌గా ఉంటాయని, లక్ష్మీరాయ్ అతిథిగా నటించడం ఈ చిత్రానికి ప్లస్సవుతుందని నిర్మాతలు అంటున్నారు. కోన వెంకట్ అందించిన కథతో దర్శకుడు అద్భుతమైన చిత్రాన్ని తీర్చిదిద్దారని, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని తెలిపారు.

ప్రకాష్‌రాజ్, నాజర్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావూ రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జైప్రకాష్‌రెడ్డి, శేఖర్, అజయ్, షఫి, శ్రీనివాసరెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు:కోన వెంకట్, పాటలు:సిరివెనె్నల, భాస్కరభట్ల, ఎడిటింగ్:గౌతంరాజు, కెమెరా:జయనన్ వినె్సంట్, సంగీతం:తమన్.ఎస్.ఎస్. నిర్మాత:పరమ్ వి.పొట్లూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గోపీచంద్ మలినేని.

English summary
BlueSky Cinemas, one of the leading players in overseas market for Indian movies is now brining another full length entertainer "Balupu" to entire overseas market. The Ravi Teja, Shruti Haasan, Anjali starrer film will be releasing on June 28th with Premiere shows on Jun 27th in all over overseas countries.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu