»   » ‘కిల్లింగ్ వీరప్పన్’: వర్మకు షాకిచ్చిన వీరప్పన్ భార్య

‘కిల్లింగ్ వీరప్పన్’: వర్మకు షాకిచ్చిన వీరప్పన్ భార్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను మట్టుబెట్టడానికి పోలీసులు ఎలాంటి వ్యూహాలు అనుసరించారు అనే విషయాలను వెల్లడిస్తూ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్'. డిసెంబర్ 4న తెలుగు, కన్నడం, తమిళంలో విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. సందీప్‌ భరద్వాజ్‌, శివరాజ్‌ కుమార్‌, రాక్‌లైన్‌ వెంకటేష్‌, పరుల్‌ యాదవ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. బి.వి.మంజునాథ్‌, ఇ.శివప్రకాష్‌, బి.ఎస్‌.సుధీంద్ర నిర్మాతలు.

అయితే మరో వారంలో విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో భారీ షాక్ తగిలింది ఈ చిత్ర నిర్మాతలకు. ఈ సినిమాను నిషేదించాలని వీరప్పన్ వైఫ్ ముత్తులక్ష్మి డిమాండ్ చేస్కతోంది. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను కేవలం హిందీలో నిర్మించేందుకు మాత్రమే తన అనుమతి తీసుకున్నాడని, ఇతర బాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు తనకు చెప్పలేదన్నారు.

వీరప్పన్‌ ఇటీవల విడుదలైన ట్రైలర్లో నెగెటివ్ గా చూపించారని, సినిమాను పూర్తిగా తనకు ముందు చూపించాలని, తన అనుమతి లేకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల చేయడానికి వీల్లేదని అంటోంది. సినిమా టైటిల్ కూడా అభ్యంతర కరంగా ఉందని, తన భర్తను నెగెటివ్ గా చూపించారని, ఈ టైటిల్ అభ్యంతరకరంగా ఉందని, దాని ప్రభావం తన ఫ్యామిలీపై ప్రభావం పడుతుంది, వెంటనే టైటిల్ మార్చాలని కోరుతోంది.

Ban on Killing Veerappan: Veerappan’s wife Muthulakshmi demanded

ఈ సినిమా గురించి వర్మ గత ఇంటర్వ్యూల్లో చెప్పిన వివరాలు...
''చరిత్రలోనే వీరప్పన్‌ ఓ అరుదైన వ్యక్తి. వీరప్పన్‌ కథని సినిమాగా తీయడానికి చాలా పరిశోధన చేశాను. అతని భార్య ముత్తులక్ష్మిని కలుసుకొని కొన్ని విషయాలు సేకరించాను. వాటన్నింటిని క్రోడీకరించి తీసిన సినిమా ఇది. వీరప్పన్‌ తిరిగిన ప్రాంతాల్లోనే షూటింగ్ జరిపాము'' అని వర్మ అంటున్నారు.

''వీరప్పన్ చరిత్రను తెరకెక్కించాలని చాలా సంవత్సరాలుగా ఆసక్తిగా ఉన్నా. ఆయన్ను పట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. చంపడానికి పోలీసులకు 20 ఏళ్లు పట్టింది. వీరప్పన్‌ను చంపడం అనే పాయింట్‌తో సినిమా తీసేందుకు చాలాకాలం పరిశోధన చేశా'' అని రామ్‌గోపాల్ వర్మ అన్నారు.

''వీరప్పన్ లైఫ్‌లో చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఇది ఆయనకు సంబంధించిన బయోపిక్ కాదు. ఈ చిత్రాన్ని రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. 'ఆపరేషన్ కుకూన్'లో పాల్గొన్న వ్యక్తులను, వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీని కలిసి సమాచారం సేకరించా. వీరప్పన్ చేతిలో కిడ్నాప్ అయిన కన్నడ నటుడు రాజ్‌కుమార్ తనయుడు శివరాజ్‌కుమార్ ఈ చిత్రంలో నటిస్తే యాప్ట్ అవుతాడని ఎంచుకున్నా. '' అని చెప్పారు.

English summary
Veerappan’s wife Muthulakshmi demanded a ban on the Killing Veerappan film alleging that RGV took her permission to make the film only in Hindi and not in other languages. Alleging that RGV portrayed Veerappan in a negative light in the trailer, Muthulakshmi said that the makers must show the complete film to her and should not release the film without her consent.
Please Wait while comments are loading...