»   » ‘చిరంజీవి కంటే రామ్ చరణే గ్రేట్, ఎన్టీఆర్‌తో ఓకే’

‘చిరంజీవి కంటే రామ్ చరణే గ్రేట్, ఎన్టీఆర్‌తో ఓకే’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిర్మాతగా ఇండస్ట్రీలో తనకు లైఫ్ ఇచ్చింది మెగా ఫ్యామిలీ హీరోలు అని చెప్పుకునే నిర్మాత బండ్ల గణేష్ అవకాశం దొరికినప్పుడల్లా వారిపై పొగడ్తల వర్షం కురిపిస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడారు. నిర్మాతగా తనకు జీవితాన్ని ఇచ్చింది పవన్ కళ్యాణ్. నా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను. అలాగే పరిశ్రమలో నిలబడేందుకు మెగా ఫ్యామిలీ సపోర్టు ఎంతగానో ఉంది అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

Bandla Ganesh about Ram Charan

మెగాస్టార్ చిరంజీవి గురించి బండ్ల గణేష్ మాట్లాడుతూ... చిరంజీవి పరిశ్రమలోకి ఎలాంటి సపోర్టు లేకుండా వచ్చారు. ఆయనకు హార్డ్ వర్క్ అంటే ఏమిటో తెలుసు. కానీ రామ్ చరణ్ వెల్ సెటిల్డ్ సినిమా స్టార్ల ఫ్యామిలీలో పుట్టారు. అయినప్పటికీ ఏ మాత్రం గర్వం ఉండదు. ఆయన ఇతరు పట్ల ఎంతో మర్యాదగా ఉంటారు. అందుకే చిరంజీవి కంటే రామ్ చరణే గ్రేట్ అని నేను అంటాను' అని చెప్పుకొచ్చారు బండ్ల గణేష్.

అదే విధంగా ఎన్టీఆర్‌తో టెంపర్ షూటింగ్ సమయంలో తనకు విబేధాలు వచ్చాయనే వార్తలపై స్పందిస్తూ..‘అలాంటిదేమీ లేదు. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్న ప్రచారం. ఎన్టీఆర్‌తో ‘బాద్ షా', ‘టెంపర్' లాంటి హిట్ చిత్రాలు తీసినందుకు గర్వంగా ఉంది అని బండ్లగణేష్ చెప్పుకొచ్చారు.

English summary
"Chiranjeevi came to the industry without any support and so he knows what hard work means. But Ram Charan was born with a silver spoon. Yet, he knows how to behave with and respect others. So I think he is greater than Chiranjeevi", Bandla Ganesh said.
Please Wait while comments are loading...